close

తాజా వార్తలు

Published : 06/08/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అంశంపై కేంద్రం ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్రల లేదని స్పష్టం చేసింది. రాజధాని

ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పి.వి.కృష్ణయ్య ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణయ్య పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కీలక వడ్డీ రేట్లలో మార్పులేదు: ఆర్‌బీఐ

మూడు రోజులపాటు జరిగిన ద్రవ్యపరపతి  సమీక్ష అనంతరం నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాకు వెల్లడించారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్లు ప్రకటించారు. రెపో రేటు యధాతథంగా 4శాతం, రివర్స్‌ రెపోరేటు యథాతథంగా 3.35 శాతం ఉంచినట్లు తెలిపారు. బ్యాంకు రేటు, మార్జినల్‌ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు యథాతథంగా ఉంటుందని శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ ఐపీఎల్‌లో ఆడటం అంత తేలిక కాదు..!

కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈకి తరలిపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వరకు షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఆ మెగా టోర్నీని నిర్వహించడం కష్టతరమే అయినందున ఆటగాళ్ల భద్రత కోసం అక్కడ నిర్వహిస్తున్నారు. అయితే, యూఏఈలో ఆడటం అంత తేలిక కాదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. తాజాగా డబ్ల్యూటీఎఫ్‌ స్పోర్ట్స్‌ యాప్‌కు గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన ఆయన ఆ సందర్భంగా వెబినార్‌ కార్యక్రమంలో పాల్గొని ఇలా అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ట్రంప్‌ పోస్టులు తొలగించిన ఫేస్‌బుక్‌,ట్విటర్‌

కరోనా వైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన పోస్టులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్‌బుక్, ట్విటర్ చర్యలు చేపట్టాయి. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ..చిన్నపిల్లలు దాదాపుగా కరోనా వైరస్‌ నుంచి తట్టుకొనే రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఫేస్‌బుక్, ట్విటర్‌లో పోస్టు చేయగా.. ఆ వ్యాఖ్యలు నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయంటూ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా: 24గంటల్లో 904 మంది మృతి!

దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 904 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40,699కు చేరింది. ఇక పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 56,282 కేసులు బయటపడ్డాయి. రోజువారీ అత్యధిక కేసుల్లో ఈ సంఖ్యది రెండోసారి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారిసంఖ్య 19,64,536కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఖైదీ’దర్శకుడితో రామ్‌ చరణ్‌ కొత్త సినిమా?

తమిళ దర్శకుల ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ముఖ్యంగా యువ దర్శకులు టాలీవుడ్‌ను బాగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో లోకేశ్‌ కనగరాజు ఒకరు. అతడి దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘ఖైదీ’చిత్రం తమిళ్‌లోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. కార్తి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను చూసిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వెంటనే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో తెలుగులో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందట. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థ రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాముని అందం అందులో కాదు.. ఇందులో ఉంది

మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగంగా జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై స్పందించాడు. ‘రాముడిలోని అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగిఉంది. చెడుపై మంచి గెలుస్తుందనడానికి అతనో సూచిక. రామ మందిరానికి భూమి పూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంబరపడుతున్నారు. ఆత్మ సంతృప్తికి ఇదో గొప్ప కార్యం’ అని వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. షావోమి నుంచి ఇక ‘ఆండ్రాయిడ్‌ వన్‌’ లేనట్లే!

షావోమి నుంచి మొబైల్‌ అనగానే తక్కువ ధర, మంచి ఫీచర్లు, ఎంఐయూఐ ముందు గుర్తొస్తాయి. అయితే, ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద ‘ఏ’ సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్‌ అన్నమాట! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోలాబా: 46ఏళ్లలో అత్యధిక వర్షపాతం!

ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని వణికిపోతోంది. గడచిన 24గంటల్లో నగరంలో పలుచోట్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ముంబయి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ ముంబయిలో అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. నగరంలోని కోలాబా ప్రాంతంలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గడచిన 24గంటల్లో ఇక్కడ 331మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదుకావడం 46ఏళ్లలో ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా వార్డు నుంచి ఖైదీ పరారీ

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సబ్‌జైలులోని 17మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఈడుపుగల్లులోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారిలో కె.వెంకటేశ్వరరావు గురువారం తెల్లవారుజామున పరారైనట్లు సిబ్బంది గుర్తించారు. వెంకటేశ్వరరావు ఇటీవల గుణదలలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు. అతని కోసం గాలిస్తున్నట్లు కంకిపాడు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.