close

తాజా వార్తలు

Updated : 01/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. డీజీపీ దగ్గరున్న సాక్ష్యాలేంటి?: వర్ల

తెదేపా అధినేత చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ రాసిన లేఖకు ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రత్యుత్తరం రాశారు. డీజీపీ రాసిన లేఖ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 సబ్‌సెక్షన్‌ 1A స్ఫూర్తికి డీజీపీ రాసిన లేఖ పూర్తి వ్యతిరేఖమని పేర్కొన్నారు. అంతర్వేది స్వామివారి రథాన్ని తగులబెట్టింది చంద్రబాబే అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తే సాక్ష్యాలు కోరుతూ ఆయనకు ఎందుకు లేఖ రాయలేదని వర్ల నిలదీశారు. చంద్రబాబును మంత్రి కొడాలి నాని బూతులు తిడితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో కొత్తగా 2,214 కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు 54,443 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దీపిక కోస్టార్స్‌కు సమన్లు.. అవాస్తవం..!

మాదకద్రవ్యాల వాడకం కేసు ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రసీమను కుదిపేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా హీరోయిన్స్‌ దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ ఇటీవల ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సదరు హీరోయిన్స్‌ సెల్‌ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీపికతో కలిసి నటించిన ఓ ముగ్గురు హీరోలకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్లు కొన్నిరోజుల నుంచి పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఆ కథానాయకుల పేర్లలోని మొదటి అక్షరాలు ‘ఏ’, ‘ఎస్‌’, ‘ఆర్‌’ అని పేర్కొంటూ ఇవి ప్రచూరితమయ్యాయి. కాగా, సదరు వార్తలపై ఎన్సీబీ అధికారి స్పందించారు. ఆ కథనాలు అవాస్తవమని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మద్యం సీసాల అంశం..వరలక్ష్మి రాజీనామా

కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్‌ మద్యం బాటిళ్లు తరలించినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్‌ కూడా ఇప్పటికే తన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్‌ ఉదయభానుతోపాటు దేవాదాయశాఖ మంత్రికి కూడా తెలియజేశానన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాను ధర్మకర్తల మండలి సభ్యురాలిగా రాజీనామా చేస్తున్నట్లు నాగ వరలక్ష్మి తన లేఖలో స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హాథ్రస్‌ ఘటనపై వివరణ ఇవ్వండి...

హాథ్రస్‌‌ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని.. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు ఎన్‌హెచ్ఆర్సీ ప్రకటించింది. ఈ విషయమై వివరణ కోరుతూ ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీ‌కు నోటీసులు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీజీ ‘నమస్తే ట్రంప్‌’ మళ్లీ ఎప్పుడు?

డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం నరేంద్ర మోదీ మరో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని చిదంబరం ప్రశ్నించారు. కొవిడ్‌-19కి సంబంధించి భారత్‌ గణాంకాల విశ్వసనీయతపై అమెరికా అధ్యక్షుడు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. భారత్‌, రష్యా, చైనా వంటి దేశాలు కరోనా వైరస్‌ మరణాల సంఖ్యలను బయట పెట్టవని మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి చర్చలో ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టీ20ల్లో ఇలాంటి షాకులు మామూలే..

కోల్‌కతాతో పోరులో ప్రణాళికలు తమ ప్రణాళికలు అమలు కాలేదని రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ అంటున్నాడు. టీ20ల్లో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని పేర్కొన్నాడు. కొన్ని విభాగాల్లో తాము మెరుగుపడాల్సి ఉందని వెల్లడించాడు. ఓటమి పాలైనప్పటికీ ముందుకు ప్రేరణతో ముందుకు సాగాల్సి ఉంటుందని వివరించారు. మ్యాచ్‌ ముగిశాక అతడు మాట్లాడాడు. ప్రణాళిక ప్రకారం సాగలేదు. టీ20ల్లో ఏమైనా జరగొచ్చు. కోల్‌కతా ఛేదనను ఇష్టపడుతుందని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాం. వారి డెత్‌బౌలర్లను ఒత్తిడికి గురి చేయాలని ప్రణాళిక వేశాం. కానీ అలా జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అభిమానులు వాటికి దూరంగా ఉండండి: అనుష్క

అసత్య ప్రచారాలకు అభిమానులు దూరంగా ఉండాలని అగ్రకథానాయిక అనుష్కశెట్టి విజ్ఞప్తి చేశారు.  ప్రభాస్‌ కథానాయకుడిగా చిత్రీకరించనున్న భారీ బడ్జెట్‌, 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’లో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్నాయి. ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న ఈ సినిమాలో సీత పాత్రలో అనుష్క మెప్పించనున్నారంటూ పలు వెబ్‌సైట్లు రాశాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క సదరు వార్తలపై స్పందించారు. ప్రభాస్‌ చిత్రంలో తాను నటించడం లేదని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకూ తనని ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం కలవలేదని తేల్చి చెప్పేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి (59) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని రాజీవ్‌గృహకల్ప‌ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె నివాసానికి వెళ్లిన రమణమూర్తి రాత్రి 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రమణమూర్తి ప్రస్తుతం కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేయ్యండిలా..!

అనుకోకుండా వేరే ఊరికి బయల్దేరాం. ఇంతలో ఫోన్‌ బ్యాటరీ డౌన్‌ అయింది. ఛార్జింగ్ పెట్టుకునే టైం లేదు. కానీ ఫోన్‌తో చాలా అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ముందుగా మనకు గుర్తొచ్చేది పవర్‌ బ్యాంక్. ఫోన్‌ సైజులో ఉండే ఈ గ్యాడ్జెట్‌ను ముందుగా ఛార్జ్‌ చేసుకుంటే అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. 2020లో వచ్చే అన్ని ఫోన్స్‌లో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఇస్తున్నారు. అయినప్పటికీ  ఫోన్‌ వినియోగం పెరిగిపోవడంతో బ్యాకప్‌ కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్లో పనిచేస్తూనే ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునేలా సౌకర్యంగా ఉండటంతో మార్కెట్లో పవర్‌ బ్యాంక్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.