close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/05/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగదు తిరిగి చెల్లింపునకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ చర్యలు

దిల్లీ: ఆరు డెట్‌ పథకాలను నిలిపివేసిన అనంతరం మదుపర్లకు నగదు తిరిగి ఇవ్వడానికి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు మదుపర్ల నుంచి అనుమతి పొందడానికి ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది.  ఈ ఓటింగ్‌కు ప్రతికూల స్పందన వస్తే, ఆస్తుల నగదీకరణ ప్రక్రియ ఆలస్యమై మదుపర్లకు నగదు చెల్లింపునకు మరింత సమయం తప్పదని ఆ ఫండ్‌ సంస్థ చెబుతోంది. మదుపర్ల నగదు చెల్లింపుపై దృష్టి సారించాలని సెబీ పేర్కొన్న కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మదుపర్ల నగదును సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రె పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.