close

తాజా వార్తలు

Updated : 05/06/2020 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జల్సాలకు అలవాటు పడి... దొంగనోట్ల తయారీ

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌

చేబ్రోలు (ఉంగుటూరు): జల్సాలకు అలవాటుపడిన నలుగురు యువకులు సులువుగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్లు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ ఒ.దిలీప్‌ కిరణ్‌ గురువారం కేసు వివరాలు తెలిపారు. నారాయణపురంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన కర్రి సత్యనారాయణ మంచాలు అమ్ముతూ మెకానిక్‌ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలు, జల్సాలకు బానిసయ్యాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో సులువుగా దొంగ నోట్ల తయారీ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అదే గ్రామంలోని టూరింగ్‌పేటకు చెందిన మానేపల్లి దుర్గాప్రసాద్‌, యర్రంశెట్టి శ్రీకాంత్‌, వైఎస్సార్‌ కాలనీకి చెందిన గంధవారపు పైడిరాజు జత కలిశారు. కలర్‌ ప్రింటర్లను కొనుగోలు చేశారు. జిరాక్స్‌తో రూ.100, రూ.200, రూ.2000 తయారు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా చుట్టు పక్క గ్రామాలలో ఈ నకిలీ నోట్లను కొద్దికొద్దిగా మారుస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌కు సమాచారం రావడంతో గురువారం ఈ నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రెండు కలర్‌ ప్రింటర్లు, రూ.1,49,200 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుని ఛేదించిన సీఐతో పాటు ఎస్సై ఐ.వీర్రాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, కానిస్టేబుల్స్‌ సబ్బే నాగరాజు, భీమరాజు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, ఎస్‌.శేఖర్‌లను ఎస్సీ నవదీప్‌సింగ్‌ అభినందించినట్లు తెలిపారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని