
తాజా వార్తలు
జీహెచ్ఎంసీ పోరు: 49మందికి నేరచరిత్ర
వెల్లడించిన సుపరిపాలన వేదిక
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 49 మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నారని సుపరిపాలన వేదిక వెల్లడించింది. వారిలో తెరాస 13, భాజపా 17, కాంగ్రెస్ 12, ఎంఐఎంలో ఏడుగురు అభ్యర్థులు నేర చరిత్ర కలిగిన వారిగా గుర్తించింది. మొత్తం 49 మంది అభ్యర్థుల్లో ఆరుగురు మహిళలు ఉండడం గమనార్హం. మల్కాజిగిరి డివిజన్లో అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడించింది. అయితే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నట్లు తెలిపింది. నేర చరిత్ర లేనివారికే ఓటు వేయాలని సుపరిపాలన వేదిక ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Tags :
జిల్లా వార్తలు