close

తాజా వార్తలు

Published : 17/03/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజ్యసభకు జస్టిస్‌ రంజన్‌ గొగోయి

దిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్‌ అయ్యారు. నామినేటెడ్‌ సభ్యుల పదవీ విరమణ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను నామినేట్‌ చేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు న్యాయవ్యవస్థలో కొద్దిమంది మాత్రమే చట్టసభల్లో సభ్యులుగా అవకాశం పొందారు.

గతంలో మాజీ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి పార్లమెంటులో సభ్యత్వం పొందారు. తాజాగా జస్టిస్‌ రంజన్‌ గొగోయి రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ అయ్యారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. 2018 అక్టోబర్‌లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించి తన పదవీ కాలంలో ఎన్నో సంచలన కేసుల్లో తీర్పులు వెలువరించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.