close

తాజా వార్తలు

Published : 02/12/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ‘ఏపీ అమూల్‌’ ప్రారంభించిన సీఎం జగన్‌

రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన రైతులకు లీటర్‌కు అదనంగా ఐదు రూపాయలైనా ఆదాయం పెరగాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసమే ప్రతిష్ఠాత్మక డెయిరీ సంస్థ అమూల్‌ భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నామన్నారు. ‘ఏపీ అమూల్‌’ ప్రాజెక్టును సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏపీ అమూల్‌ వెబ్‌సైట్‌, డ్యాష్ బోర్డును సీఎం ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రైతులపై మరోసారి జలఫిరంగుల ప్రయోగం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు మరోసారి జల ఫిరంగులు ప్రయోగించారు. అంతకంతకూ పెద్ద సంఖ్యలో చేరుతున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. బలప్రయోగంతో అణచివేయడం కుదరదని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*చట్టాల్లో ఏముంది..రైతుల అభ్యంతరాలేంటీ?

3. మూడో రోజూ తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజూ తెదేపా సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చలో సీఎం జగన్‌ మాట్లాడుతుండగా తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్షం స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లింది. చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాల్సినంత సమయం ఇచ్చినా ఉద్దేశపూర్వంగానే తెదేపా సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపడుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. గల్వాన్‌ ఘర్షణ.. చైనా పక్కా ప్లాన్‌!

భారత్ పొరుగుదేశం చైనా కుతంత్రాలు, కవ్వింపులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దుల్లో రెచ్చగొడుతూ డ్రాగన్‌ కావాలనే పక్క దేశాలతో ఘర్షణలు దిగుతోందని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణలకు కూడా చైనా పక్కా పథకం రూపొందించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*డ్రాగన్‌ వెన్నులో చలి

5. వంటగ్యాస్‌ ధర భారీగా పెంపు 

సామాన్యులపై మరో పిడుగు పడింది. ఓవైపు పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరపై చమురు సంస్థలు భారీగా వడ్డించాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడినట్లయింది. వినియోగదారులకు రాయితీగా అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 594గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ. 644కు పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కేసుల భయంతో సరెండర్‌ అయ్యారు: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై కేంద్రాన్ని అడగలేక సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. శాససనభ శీతాకాల సమావేశాల్లో భాగంగా మూడోరోజు పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైకాపా చెప్పిన మాటలన్నీ విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించారని.. పోలవరం పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బ్రహ్మపుత్రపై భారత్‌ భారీ ప్రాజెక్టు

టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో దాని వల్ల తలెత్తే దుష్ప్రభావాలను అడ్డుకోవాలని మన దేశం నిర్ణయించింది. చైనా ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌లో బహుళ ప్రయోజన ప్రాజెక్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి టి.ఎస్‌.మెహ్ర మంగళవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఫైజర్‌ టీకాకు యూకే అనుమతి మంజూరు..!

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన కొవిడ్‌ టీకాకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఫైజర్‌ టీకాకు అనుమతి మంజూరు చేసిన తొలిదేశంగా నిలిచింది. దీనిపై ఫైజర్‌ స్పందిస్తూ తక్షణమే తమ వద్ద ఉన్న వాటిని యూకేకు తరిలించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు పేర్కొంది. దీనిని వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. 30 ఏళ్ల తర్వాత.. చైనాకు మన బియ్యం!

భారత్‌ నుంచి బియ్యం కొనుగోలుకు చైనా ముందుకొచ్చింది. లద్దాఖ్‌ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి బియ్యం దిగుమతులను చైనా ప్రారంభించిందని బియ్యం మిల్లుల ప్రతినిధులు  వెల్లడించారు. అంతర్జాతీయం బియ్యం సరఫరాను కఠినతరం చేయడం, ధరల తగ్గింపు నేపథ్యంలో చైనా ముందుకొచ్చినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌

ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. బాహుబలి హీరో ప్రభాస్‌.. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించారు.  గత కొంతకాలంగా వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందని సినీ ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా.. ఆ వార్తను ఖరారు చేస్తూ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ఓ పోస్టు చేశారు. తన దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారని నీల్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

లైవ్ బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని