close

తాజా వార్తలు

Published : 01/12/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. గ్రేటర్‌పోరు: 4గంటలకు ఎంత పోలింగ్‌ అంటే?

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కొద్దిమేర పుంజుకుంది. మధ్యాహ్నం 4 గంటల వరకూ 29.76 శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగా సాగిన  మధ్యాహ్నం తర్వాత కొంతమేర పెరిగింది. లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

*ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

2. కేంద్రంతో రైతుల చర్చలు ప్రారంభం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న అన్నదాతలతో ఎట్టకేలకు కేంద్రం చర్చలు ప్రారంభించింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 35 రైతు సంఘాల నాయకులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, దిల్లీ రైతులతో సాయంత్రం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*రైతుల ఆందోళన: ట్రూడో వ్యాఖ్యలు అనవసరం

3. వైకాపా రంగుల ఖర్చు రాబట్టాలని పిటిషన్‌

ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలను వైకాపా రంగులు వేయడానికి, తొలగించడానికి అయిన రూ.4వేల కోట్లను రాబట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారి నుంచే సొమ్ము వసూలు చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా పేదల ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల అంశాలపై జరిగిన చర్చలో తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర తెదేపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు స్థలసేకరణ తదితర అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌లో కరోనా పరీక్షలు @14 కోట్లు

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మూడు నెలల కనిష్ఠానికి ‘తయారీ’

లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చిన భారత తయారీ రంగ కార్యకలాపాలు మరోసారి నెమ్మదించాయి. నవంబరులో తయారీ మూడు నెలల కనిష్ఠానికి చేరింది.  ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎమ్‌ఐ) నవంబరులో 56.3 పాయింట్లుగా నమోదైంది. అక్టోబరులో ఈ సూచీ 58.9గా ఉండింది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని.. తయారీ రంగం బలంగానే ఉందని నిపుణులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మరోసారి లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్లు దాటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం నవంబర్‌ నెలకు గానూ రూ.1,04,963 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌తో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గగా.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే 1.4 శాతం వసూళ్లు (₹1,03,491 కోట్లు) పెరగడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంటుందా?

ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా రేపటి వన్డేలో భారత్‌కు విజయం తప్పనిసరి. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండా, మరోవైపు క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బైడెన్‌కు చైనా ‘అరుదైన’ స్వాగతం..!

అమెరికాకు సంబంధించిన కీలక ఎగుమతులను చైనా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా చైనా ఈ చర్యలను చేపట్టింది. రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు.. అంశాలు దీనిలో ఉండే అవకాశం ఉంది. టిక్‌టాక్‌, హువావే, టెన్సెంట్‌ వంటి కంపెనీలపై అమెరికా ఆంక్షలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చే చైనా సరికొత్త ఆంక్షలతో వాణిజ్యపోరు మరోస్థాయికి చేరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లో బుల్‌బెల్‌ మోగింది..  

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా ర్యాలీ చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 13,109 వద్ద, సెన్సెక్స్‌ 505 పాయింట్లు పెరిగి 44,655 వద్ద స్థిరపడ్డాయి. టాటామెటాలిక్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫినాన్స్‌, వాక్రెంజ్‌, మహీంద్రా లైఫ్‌ స్పేస్‌ షేర్లు భారీగా లాభపడగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు, వరుణు బేవరేజస్‌, మెట్రోపోలీస్‌ హెల్త్‌కేర్‌ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ తప్ప మిగిలిన సూచీలు మొత్తం లాభాల్లోనే ఉండటం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని