close

తాజా వార్తలు

Published : 27/09/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణి సహా 7 గురు మృతి!

కర్ణాటకలోని కలబుర్గిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో గర్భిణి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం కలబుర్గి సమీపంలోని సవలగి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సవలగి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక గర్భిణి కూడా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆర్‌బీఐ రివ్యూ.. కీలక వడ్డీరేట్లు యథాతథం?

భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఈ సారీ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు సమీక్షంచనుంది. అక్టోబర్‌ 1న ఎంపీసీ తన నిర్ణయాలను వెలువరించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు

దేశంలో రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు అన్ని రాష్ర్టాలకు కావల్సినన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతంలో పీపీఈ కిట్లు కొరత ఉందన్న రాష్ర్టాలే ప్రస్తుతం వాటిని నిల్వ చేయడానికి స్థలం లేదనే స్థాయికి చేరుకున్నాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏడు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ఆయన రికవరీ రేటు 82 శాతం ఉన్నట్లు వివరించారు. 

4. భారత్‌ షాక్‌ ఇస్తుంది.. జాగ్రత్త..!

చైనా దళాలు భారత్‌ను‌ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చైనా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వాంగ్‌హాంగ్‌యాంగ్‌ హెచ్చరించారు. ఈయన గతంలో నాన్‌జింగ్‌ మిలటరీ రీజియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్‌ షాక్‌ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లిజిన్‌ అనే రక్షణ సంబంధ వ్యవహారాలను ప్రచురించే ఒక సామాజిక మాధ్యమ ఖాతాలో తెలిపినట్లు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నాగార్జునసాగర్‌ వద్ద పీవీ సింధు సందడి

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు నాగార్జునసాగర్‌ ఆనకట్టను సందర్శించారు. భారీ వర్షాలకు ఆనకట్ట గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పీవీ రమణ, విజయతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్‌ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా సింధుతో పాటు కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.

6. చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకాలు

ఇంకా ప్రయోగదశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా దీన్ని ఆపడంలేదని నిపుణులు మండిపడుతున్నారు. ‘అత్యవసర వినియోగం’ పేరుతో ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. చైనాలో పలు సంస్థలు కరోనాకు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. అవన్నీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. సాధారణ వినియోగానికి ఇంకా అనుమతి రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మూసీనది ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ

మూసీనది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అప్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వివేకా హత్యకేసులో విచారణకు మరో ముగ్గురు

మాజీమంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల కోణంలోని దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇవాళ కొత్తగా ముగ్గురు అనుమానితులు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురూ కడప నగరానికి చెందిన చెప్పుల దుకాణం డీలర్లుగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. డ్రగ్స్‌ కేసు.. ఇంతకీ ‘క్వాన్‌’ ఏం చేస్తుందో తెలుసా..!

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నో కొత్త విషయలు బహిర్గతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెరపైకి ఇచ్చిన పేరు ‘క్వాన్‌ టాలెంట్‌ ఏజెన్సీ’. ఇందులో పనిచేస్తోన్న కరీష్మా ప్రకాశ్‌(దీపిక మేనేజర్‌) జయాసాహా(సుశాంత్‌ మేనేజర్‌)ను ఇప్పటికే ఎన్సీబీ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ‘క్వాన్‌’ టాలెంట్‌ ఏజెన్సీ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మేరట్‌లో నిర్భయ తరహా ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం చోటుచేసుకుంది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా కదులుతున్న బస్సులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రంతా మహిళపై లైంగిక దాడిచేసి అనంతరం ఆమెను బస్సులోనుంచి బయటకు తోసేశారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని కొందరు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్న ఆమె తనపై జరిగిన లైంగిక దాడిని పోలీసులకు వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.