close

తాజా వార్తలు

Published : 20/09/2020 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం!

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ తెలిపారు. కాంగ్రెస్‌, తెరాస, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రైతు చేతికి అధికారం: ప్రధాని మోదీ

భారత వ్యవసాయ రంగ చరిత్రలో ఇదో శుభదినం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే కోట్ల మంది రైతులకు చేతికి అధికారం వస్తుందని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కీలక బిల్లుల ఆమోదం అనంతరం ఆయన వరుస ట్వీట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. హెర్డ్‌ ఇమ్యూనిటీకి ప్రయత్నం.. ప్రమాదం!

కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి కచ్చితమైన ఔషధాలు లేకుండా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’కి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. భారీస్థాయిలో ప్రజలు వైరస్‌ బారినపడి మరణించే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే రాజ్యసభలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు‌ ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ కోసం రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మావోయిస్టు నేత కోసం కూంబింగ్‌ ముమ్మరం

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో 9ఎంఎం పిస్తోలుతో పాటు, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పిడికిలి బిగించిన పెద్దన్న..! 

ఇరాన్‌పై ఉన్న ఐక్యరాజ్య సమితి ఆంక్షలన్నింటినీ పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యని చట్టవిరుద్ధంగా పేర్కొన్న ప్రపంచ దేశాలు ట్రంప్‌ పాలకవర్గంపై పెదవి విరిచాయి. దీంతో త్వరలో జరగబోయే ఐరాస వార్షిక సమావేశాల్లో ఇది చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. 2015లో కుదిరిన ఇరాన్‌ అణుఒప్పందం ప్రకారం ‘జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్’‌(జేసీపీఓఏ)లోని నిబంధనల్ని ఇరాన్‌ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. భారత్‌-నేపాల్‌ మధ్య తొలిసారిగా

భారత్‌-నేపాల్‌ మధ్య తొలిసారిగా ప్యాసింజర్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. నేపాల్‌కు ఆధునిక సదుపాయాలున్న రెండు ‘డీజిల్‌-ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌(డీఎంసీయూ)’ రైళ్లను శుక్రవారం భారత్‌ అందజేసింది. బిహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాలోని కుర్తాల మధ్య 35 కిలోమీటర్ల పొడవున తొలిసారిగా నిర్మించిన బ్రాడ్‌ గేజ్‌ రేల్వే మార్గంలో ఈ రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది: పూరీ

రాత్రిపూట నిద్రమేలుకునే వారికి తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. తనకు కూడా చిన్నప్పుడు నిద్రపట్టేది కాదని, ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన ‘నైట్‌’ అనే అంశంపై మాట్లాడారు. రాత్రి పూట పనులు చేయడం, ఆలోచించడం గురించి ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వాట్సాప్‌: రాబోయే సరికొత్త ఫీచర్లు ఇవేనా...!

ప్రముఖ చాటింగ్‌ యాప్‌ వాట్సాప్ రోజురోజుకూ కొత్త అప్‌డేషన్స్‌ను యూజర్లకు అందిస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే వాట్సాప్‌ ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సందేశాలను ఇతరులు చూడకుండా యాప్ ఓపెన్ కాకుండా ఉండేందుకు ఫింగర్‌ప్రింట్‌ ద్వారా లాక్‌ చేసుకునేలా యూజర్లకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ను వాట్సాప్‌ వెబ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితోపాటు మరికొన్ని ఫీచర్లను యూజర్లకు వాట్సాప్‌ అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పార్లమెంట్‌ వద్ద వైకాపా ఎంపీల ధర్నా

పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైకాపా ఎంపీలు ధర్నా నిర్వహించారు. అంతర్వేది ఘటన, అమరావతి భూ కేటాయింపులు, ఫైబర్‌ నెట్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ డిమాండ్‌ చేశారు. వరుసగా మూడో రోజూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.