close

తాజా వార్తలు

Published : 11/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని మంగళవారం విడుదల చేసిన  మెడికల్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. కాగా, తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పుతిన్‌ కుమార్తెకు కొవిడ్‌ టీకా..!

కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది. కరోనా వైరస్‌పై రష్యా తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేశారు. తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలిదేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్‌.. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆడపిల్లలకు ఆస్తి హక్కు.. సుప్రీం చారిత్రక తీర్పు

హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కును గురించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రి (లేదా తల్లి) 2005 కంటే ముందే మరణించినా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని.. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేటి తీర్పులో స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రాయలసీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు ముగిశాయి. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం

తెలంగాణలో కరోనా  వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. మంగళవారం సీఎంలతో ప్రధాని నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని చెప్పారు. కరోనా రికవరీ రేటు 71శాతం, మరణాల రేటు 0.7శాతం ఉందన్నారు. కరోనా బాధితులకు మెరుగైన  వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఈ 10రాష్ట్రాలు కట్టడిచేస్తే..వైరస్‌పై విజయమే!

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న పదిరాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనాపై భారత్‌ విజయం సాధించినట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్‌ అమలుపై నేడు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కొవిడ్‌ టెస్టులు అమెరికా, భారత్‌లోనే ఎక్కువ!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోన్న దేశాల్లో అమెరికా, భారత్‌లు ముందున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే అమెరికాలో 6కోట్ల 50లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయంలో అమెరికాకు దగ్గరలో ఏ దేశం కూడా లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడిన ట్రంప్‌, వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌ (35), నజీముద్దీన్‌ గుజ్జర్‌ (44), అబ్దుల్‌ ఖయ్యుమ్‌‌ (29)గా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్‌ పైలట్

రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ అన్నారు. తన మాజీ బాస్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ తనను పనికిరానివాడని దూషించినా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్‌ తెలిపారు. ‘‘పని, పాలనాపరమైన వ్యవహారాలలో నా అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు నాకు ఉంది. కానీ అశోక్‌ గహ్లోత్ గారి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి’’అని పైలట్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బిలియనీర్ల క్లబ్‌లో టిమ్‌ కుక్‌

సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేసే సాంకేతిక దిగ్గజం యాపిల్‌ అధినేత టిమ్‌ కుక్‌ మరో ఘనతను స్వంతం చేసుకున్నారు. టిమ్‌ వ్యక్తిగత సంపద ఒక బిలియన్‌ డాలర్లను మించటంతో...  ఈ ఘనత సాధించిన జుకర్‌బర్గ్‌ తదితర సీఈఓల సరసన నిలిచారు. యాపిల్‌లో 8,47,969 షేర్లు టిమ్‌ కుక్‌ స్వంతమని తెలిసిందే. గత వారం యాపిల్‌ షేర్ల విలువ ఐదు శాతం వరకూ పెరగటంతో.. సంస్థ మార్కెట్‌ విలువ సుమారు రెండు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.