close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. నన్ను ఏ చట్టం కింద అరెస్ట్‌ చేస్తారు?:చంద్రబాబు

అనుమతి తీసుకునే విశాఖ పర్యటనకు వచ్చానని..  అయినా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏ చట్టం కింద వెనక్కి వెళ్లమంటున్నారని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. ఏ చట్టమో చెప్పి.. దాని ప్రకారం నోటీసు ఇచ్చి తనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎక్కడికైనా వచ్చి సహకరిస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఐపీఎల్‌ 2020: సన్‌రైజర్స్‌ సారథిగా వార్నర్‌

పీఎల్‌ సరికొత్త సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని డేవీనే స్వయంగా అభిమానులకు తెలియజేశాడు. సన్‌రైజర్స్‌ అధికారిక ట్విటర్లో అతడీ విషయం చెబుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. దక్షిణాఫ్రికాలో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో ఏడాది నిషేధానికి గురైన వార్నర్‌ 2018 సీజన్‌లో ఆడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘అమిత్ షాను తక్షణమే తొలగించండి’

దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల పట్ల కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు మౌన ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. దిల్లీ ఘటనలపై సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతికి అందజేశారు. హింసను అరికట్టకుండా అసమర్థంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. విశాఖలో చంద్రబాబు ముందస్తు అరెస్ట్‌

తెదేపా అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. వీఐపీ లాంజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచే వీలుంది.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకోండి

తెలంగాణలో గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలల బ్రాంచిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా... ఇవాళ ఇంటర్‌ బోర్డు నివేదిక సమర్పించింది. పరీక్షలు ముగిసిన తర్వాత కళాశాలలు మూసివేసేందుకు అనుమతివ్వాలని ఇంటర్‌ బోర్డు హైకోర్టును కోరింది. అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు బోర్డును ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘రూ.500 ఇస్తాం.. గుడ్లు, టమాటాలు విసరాలి’

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నాయకులు తీసుకొచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు కాన్వాయ్‌పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. భవిష్యత్తును తలచుకుంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పాక్‌కు చైనా ‘బాతు’ సాయం

మిడతలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది డ్రాగన్‌ దేశం చైనా. ఇందులో భాగంగానే ఆ దేశానికి ‘బాతు సాయం’ ప్రకటించింది. మిడతలపై పోరాటంలో పాక్‌కు సాయం చేసేందుకు లక్ష బాతుల ‘ఆర్మీ’ని పంపించనున్నట్లు చైనా స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. చైనా నిపుణుల సలహా మేరకు జిజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి ఈ బాతులను పాక్‌కు పంపనున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కంది రైతుల సమస్యలు తీర్చాలి: రేవంత్‌

కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కంది రైతులు రోడ్కెక్కే పరిస్థితులు వచ్చాయని, అలాంటప్పుడు రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయని ఆయన  ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించకపోతే ‘రైతు గోస’ పేరుతో తమ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.ఈ మేరకు కందుల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాంపల్లి న్యాయస్థానంలో హాజరయ్యారు. 2010లో నిజామాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసినందుకు కవిత తోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ధర్నాకు దిగినందువల్ల పోలీసులు ఏ1గా కవితను చేర్చారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 40వేల మార్కును దిగజారడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమాయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 143 పాయింట్లు నష్టపోయి 39,745 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 11,633 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.62 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.