close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలు: ట్రంప్‌

తమ భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా మిగిలిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మూడు బిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం ఖరారైనట్లు ప్రకటించారు. అందులో భాగంగా అపాచీ, ఎంహెచ్‌60 రోమియో వంటి అధునాతన హెలికాప్టర్లను అందజేయనున్నామని వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. 5జీ సాంకేతికత, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

2. HYD మెట్రో: రెండోదశలో మూడు కొత్త మార్గాలు

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. దీనికిగానూ డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రెండో దశలో రాయదుర్గం నుంచి ఆర్జీఐఏ (31 కి.మీ.), లక్డీకాపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

3. ఈ బంధం ప్రజలది..: మోదీ

భారత్‌-అమెరికా సంబంధాలు కేవలం ఇరు దేశాల మధ్యవే కావని.. ప్రజల మధ్యవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మొత్తం మూడు ఎంవోయూలు కుదుర్చుకొన్నారు. రక్షణ, భద్రత, శక్తి, టెక్‌ సహకారం, గ్లోబెల్‌ కనెక్టివిటీ, వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

4. పీవీ సింధు సందేశం: వీడియో విడుదల చేసిన జగన్‌

ప్రభుత్వ శాఖల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను సీఎం విడుదల చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు సందేశంతో ఈ వీడియోను విడుదల చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఇసుక మాఫియాకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ ఆందోళనలు..!

ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల అంశాన్ని నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీన్ని వెంటనే విచారణకు స్వీకరించాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ వజాహత్‌ హబీబుల్లా‌, సామాజిక కార్యకర్త బహదూర్‌ అబ్బాస్‌ నక్వీ పిటిషన్‌ దాఖలు చేశారు. వెంటనే నిందితుల్ని గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. అందుకే గుమ్మడివెల్లిని ఎంచుకున్నా:కిషన్‌రెడ్డి

తన నియోజకవర్గంలో గ్రామాలు లేనందునే గుమ్మడివెల్లిని దత్తత తీసుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లిలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దత్తత గ్రామంగా సొంత, అత్తగారి ఊర్లను ఎంపిక చేయొద్దని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. పోలీసుల అదుపులో దిల్లీ కాల్పుల నిందితుడు

ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనలలో కాల్పులు జరిపిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిని షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్‌గా గుర్తించారు. ‘‘జఫ్రాబాద్ ప్రాంతంలో ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆందోళకారుల మధ్య నుంచి వచ్చి మరో వైపున ఆందోళ చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తిరిగి గుంపులో కలిసిపోయాడు. అంతేకాకుండా అతడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై తుపాకీ గురిపెట్టి నెట్టివేశాడు’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. ఇండిగోలో నిబంధనల ఉల్లంఘన గుర్తించిన సెబీ

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో నిబంధనలు ఉల్లంఘించినట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) గుర్తించింది. ముఖ్యంగా ఇవి నిర్వహణలో, కంపెనీ లిస్టింగ్‌ నిబంధనలకు సంబంధించినవిగా సమాచారం. కంపెనీ సహ ప్రమోటర్‌ రాకేష్‌ గాంగ్వాల్‌ ఫిర్యాదు మేరకు నిర్వహించిన దర్యాప్తులో ఈ అంశాలు తేలాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. దేశంలో హింసకు తావులేదు: సోనియా గాంధీ

దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. ఈసమయంలో యావత్ దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా దిల్లీ ప్రజలను అభ్యర్థించారు. సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. దిల్లీ ప్రజలు సంయమనం పాటించాలి:కేజ్రీవాల్‌

ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో దిల్లీవాసులంతా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తుల ధ్వంసం, వాహనాలను తగలబెట్టడం, ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు విచారకరమని అన్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో పోలీసు బలగాలు తక్కువగా ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యేలు తనతో చెప్పారని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.