close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆ హామీ ఎటు పోయింది?

‘దేశంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలే. మహిళలపై దాడులు అధికమయ్యాయి.  మోదీ చెప్పిన సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ ఎక్కడ’? అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశ్నించారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన భారత్‌ బచావ్‌ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మోదీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తి

అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది.  సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో నాలుగు గంటల పాటు రీపోస్టుమార్టం జరిగింది. ఫోరెన్సిక్‌ బృందం అయేషా పుర్రె,, ఆస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించి వాటిని పరిశీలించింది. అయేషా ఎముకల నుంచి కూడా పలు అవశేషాలను సేకరించింది. మృతదేహాన్ని వెలికితీయగా లభించిన అవశేషాలను ఓ బాక్స్‌లో ఉంచి సీలు చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. రీపోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ బృందం పూర్తి నివేదికను సీబీఐకి అప్పగించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పెరగనున్నముఖ్య ఔషధాల ధరలు

దేశంలో అత్యధికంగా ఉపయోగించే 21 రకాల ముఖ్యమైన ఔషధాల ధరలు త్వరలో పెరగనున్నాయి. మందుల ధరలను నియంత్రించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అధారిటీ (ఎన్‌పీపీఏ), ఈ మందుల ధరలను 50 శాతం వరకు పెంచటానికి అనుమతినిచ్చింది. ధరలు పెరగనున్న ఔషధాలలో యాంటీబయోటిక్స్, ఎలర్జీ నివారణ మందులు, మలేరియా నివారణమందులు, బిసీజీ వాక్సిన్‌, విటమిన్‌ సి వంటివి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కార్మికసంఘాల ఎన్నికలు జరపాల్సిందే: అశ్వత్థామ

ప్రజాస్వామ్య దేశంలో కార్మిక సంఘాలుండాలని, కచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వాత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనియన్లకు  సంబంధించి రహస్య ఓటింగ్‌ పెట్టాలన్నారు. ఎక్కువమంది అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రామమందిరం కోసం రూ.11, ఇటుక ఇవ్వండి

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి రూ.11, ఓ ఇటుక విరాళంగా ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కోరారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం. ప్రతీ కుటుంబం తమ వంతుగా రూ.11,  రామ మందిరం కోసం ఓ ఇటుక విరాళంగా ఇవ్వండి’ అని సీఎం యోగి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘నమామి మూసీ’  ప్రారంభించిన లక్ష్మణ్‌

‘నమామీ మూసీ’ పేరుతో మూసీనది ప్రక్షాళన ఉద్యమాన్ని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రారంభించారు. అనంతగిరి మూసీ నది వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ నదికి గొప్ప చరిత్ర ఉందన్నారు. అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ నది.. హైదరాబాద్ గుండా ప్రయాణించి  సూర్యాపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల వ్యర్థాలు కలిసిపోవడంతో మూసీనది కలుషితమవుతోందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. దిశ చట్టంపై విస్తృత ప్రచారం చేస్తాం: వాసిరెడ్డి పద్మ

గుంటూరు జిల్లా నగరపాలెంలో అత్యాచారానికి గురైన యువతిని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చట్టప్రకారం చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామని, మహిళ కమిషన్ ద్వారా దిశ చట్టంపై విస్తృత ప్రచారం చేస్తామని పద్మ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సరదాగా కాసేపు.. మోదీ బోటు షికారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు మోదీ నేడు కాన్పూర్‌ వచ్చారు. ఈ సందర్భంగా గంగా నదిలో కాసేపు సరదాగా బోటు షికారు చేశారు. గంగానది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను ప్రధాని అధికారులతో చర్చించారు. స్వచ్ఛ గంగ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌కు మోదీ నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నాపై అభిశంసన సరైంది కాదు: ట్రంప్‌

దేశం కోసం ఎంతో చేస్తున్న తనపై అభిశంసన తీసుకురావడం సరైంది కాదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని ట్వీట్ చేసిన ఆయన.. రాజకీయ ప్రేరేపితంగానే తనపై ఈ అభిశంసన తీసుకొచ్చారంటూ డెమోక్రాట్‌ పార్టీపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏడో ఆర్థిక గణన మార్చి 2020కి పూర్తి 

దేశవ్యాప్తంగా చేపట్టిన ఏడో ఆర్థిక గణన మార్చి 2020 కల్లా పూర్తి కావొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం డైరక్టర్‌ జనరల్‌ ఏకే సాధు ప్రకటించారు. ఈ లెక్కింపును సాధారణ సేవా కేంద్రాల (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌- సీఎస్‌సీ) ద్వారా నిర్వహిస్తారు. ఈ మేరకు గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఇ-గవర్నెన్స్‌ సీఎస్‌సీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.