close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120037507 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => dZ5fzNOWxDw [video_short_link] => dZ5fzNOWxDw [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-03-18 19:19:02.510893 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 18/03/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెలవులు ప్రకటించింది అందుకు కాదు: ఈటల

హైదరాబాద్‌: ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చివ వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 6కు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి తప్పకుండా స్క్రీనింగ్‌ చేస్తూ.. వారికి ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని కమిటీ అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. నిమ్స్‌, ఫీవర్‌, ఐపీఎం, ఉస్మానియా ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తి అయిందన్నారు. భారత్‌లో ఎక్కడా నేరుగా కరోనా రాలేదని ఐసీఎంఆర్‌ ఒక నివేదికలో ప్రకటించిందని మంత్రి ఈటల తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

క్వారంటైన్లు సిద్ధం

విదేశాల నుంచి 20 వేల మందికిపైగా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా కావాల్సినన్ని క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల వివరించారు. ఈ క్వారంటైన్‌ సెంటర్లు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయన్నారు. ప్రతి క్యారంటైన్‌ సెంటర్‌లో ఒక వైద్యుడు, వైద్యుడికి సాయంగా కావాల్సిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. వికారాబాద్‌, దూలపల్లిలో క్వారంటైన్‌ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటితో పాటుగా మరికొన్ని క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. విమానాశ్రయాల్లో నిత్యం స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని, కరోనా లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని 40 ప్రత్యేక బస్సుల ద్వారా క్వారంటైన్‌ సెంటర్లకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా ప్రభావం గుర్తించకముందు రాష్ట్రానికి వచ్చిన వారిని కూడా గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.

సెలవులు పర్యటనలకా?

కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఏవైనా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ప్రకటించింది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని తప్ప ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు కాదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరస్‌ బారిన పడకుండా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని మంత్రి సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.