గ్యాంగ్‌వార్‌ కేసులో మరో 11 మంది అరెస్టు
close

తాజా వార్తలు

Published : 08/06/2020 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాంగ్‌వార్‌ కేసులో మరో 11 మంది అరెస్టు

విజయవాడ: విజయవాడ పటమట గ్యాంగ్‌ వార్‌ ఘటనలో మరో 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పండు ముఠాలో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈరోజు సందీప్‌ ముఠాలోని 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ హర్షవర్ధన్‌ తెలిపారు. సందీప్‌ గ్యాంగ్‌లోని రౌడీషీటర్‌ కిరణ్‌ తొందరపాటు కారణంగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు చెప్పారు. ప్రశాంత్‌, పండుతోపాటు మరొకరు కలిసి సందీప్‌పై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. 

ఓ అపార్ట్‌మెంట్‌ విషయమై జరిగిన సెటిల్‌మెంట్‌లో భాగంగా ఇటీవల పటమటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 30 మంది కర్రలు, కత్తులు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ సందీప్‌ గతనెల 31న మృతి చెందాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని