close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు:సజ్జనార్‌

దిశ హత్యోదంతంలో తొలుత ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించి క్రమంగా సైంటిఫిక్‌ ఆధారాలను సేకరించామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. కాల్పుల్లో నిందితులు మృతిచెందిన నేపథ్యంలో ఘటనాస్థలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాల్పులు జరిగిన తీరు, అందుకు గల కారణాలను సీపీ వివరించారు. ‘దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చాం. దిశ ఫోన్‌, వాచీ, పవర్‌బ్యాంక్‌ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లాం. అక్కడ రాళ్లు, కర్రలతో పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ రాత్రి తలచుకుంటేనే రక్తం మరిగిపోతోంది!

దిశ కేసు నిందితులపై కాల్పుల ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హైదరాబాద్‌ శివారులో ఇటీవల దిశపై జరిగిన దారుణం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని అన్నారు. ఆ ఘటన జరిగిన రాత్రి నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు. యావత్‌ జాతి తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఇలాంటి ఆవేదనేనన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు ముగిసిపోయాయని అనుకోవద్దన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆరిఫ్‌, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!

దిశ హత్యోదంతం కేసులో కాల్పుల్లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాలకు తహసీల్దార్ల ఆధ్వర్యంలో పంచనామా పూర్తయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. క్లూస్‌టీం కూడా సంఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పారిపోతున్న క్రమంలో ఇద్దరు నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు మృతిచెందారు.  నిందితుల్లో ఆరిఫ్‌తో పాటు చెన్నకేశవులు చేతులో పోలీసులకు సంబంధించిన తుపాకులు ఉన్నాయి. అవి ఘటనాస్థలంలోనే పడి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ ఇలాంటి ఘటన ఒక్కటే పరిష్కారం కాదు’

దిశ హత్యకేసు నిందితుల మృతిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల ఘటనపై గుంటూరులోని అభ్యుదయ కళాశాల విద్యార్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా ‘దిశ’కు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగిందని అధ్యాపకులు, విద్యార్థినులు అన్నారు. అయితే ఇలాంటి ఘటనే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళల పట్ల గౌరవ భావం పెరగాలని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులపై కాల్పులు ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నిజానిజాలు తెలుసుకునేందుకు వెంటనే ఒక బృందాన్ని ఘటనాస్థలానికి పంపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ డీజీ(దర్యాప్తు)ని ఆదేశించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’

దిశ నిందితులపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులపై హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మరక్షణలో భాగంగా ఇలాంటి కాల్పులు సరైనవే కానీ.. నిందితులకు చట్టపరంగా శిక్ష పడితే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాల్పులపై కేంద్ర హోంశాఖ ఆరా!

దిశ నిందితులపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో న్యాయపరంగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘దిశ’కు ఇది నిజమైన నివాళి: చిరంజీవి

దిశ కేసులో నిందితులపై కాల్పుల ఘటనపై పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందలు తెలిపారు. ‘‘దిశ’ ఘటనలోని నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూశాను. నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఘటనాస్థలికి బయల్దేరిన మృతుల తల్లిదండ్రులు

దిశ హత్యాచార కేసులో కాల్పుల్లో మృతి చెందిన నిందితుల తల్లిదండ్రులు ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. మక్తల్ సీఐ శంకర్‌ బృందం వారిని సంఘటన స్థలికి తీసుకెళ్లింది. నారాయణపేట జిల్లా గుడిగండ్ల నుంచి  మహ్మద్‌ పాషా తండ్రి హుస్సేన్‌, నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవుల తండ్రి కురుమప్ప సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు. మృతుల తల్లిదండ్రులతో వనపర్తి ఎస్పీ అపూర్వారావు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోలీసులకు మిఠాయిలు తినిపించిన స్థానికులు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.