close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/01/2020 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయానికి పోరాటం

 ఆసక్తిగా ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019

 బౌలింగ్‌లో సత్తా చాటిన క్రీడాకారులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ఈనాడు-స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 క్రికెట్‌ జిల్లాస్థాయి పోటీలు నగరంలోని డీఎస్‌ఏ, వైద్య కళాశాల మైదానాల్లో రసవత్తరంగా సాగుతున్నాయి. క్రీడాకారులు తమతమ జట్ల విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శుక్రవారం పలువురు క్రీడాకారులు అద్భుతమైన ఫీల్డింగ్‌తో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ పోటీలకు అసోసియేట్‌ స్పాన్సర్లుగా నారాయణ విద్యా సంస్థలు, రీజినల్‌ స్పాన్సర్లుగా దీక్ష జూనియర్‌ కళాశాల, జిల్లా స్పాన్సర్‌గా రాగమయూరి బిల్డర్స్‌ వ్యవహరిస్తున్నాయి. ప్రథమ చికిత్సను ఎస్‌జే ఆసుపత్రి అందిస్తోంది. 

డీఎస్‌ఏ స్టేడియం

ఉస్మానియా కళాశాల జట్టు విజయోత్సాహం

మొదటి పోటీ కర్నూలు ఉస్మానియా డిగ్రీ కళాశాల, కర్నూలు కేవీఎస్‌ఎం (ఎంబీఏ) కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కేవీఎస్‌ఎం జట్టు 6 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ధన 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశారు. బౌలింగ్‌లో చైతన్య 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 8 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఉస్మానియా జట్టు 6 వికెట్ల నష్టానికి విజయానికి కావాల్సిన 73 పరుగులు చేసింది. అబ్బాస్‌ 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 పరుగులు చేశారు. బౌలింగ్‌లో లక్ష్మణ్‌ 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 3 వికెట్ల తేడాతో ఉస్మానియా డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన చైతన్య జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 

ప్రతిభ చాటిన ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు

రెండో పోటీ ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆత్మకూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. రాకేష్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్‌లతో 49 పరుగులు చేశారు. బౌలింగ్‌లో కలంధర్‌ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 10 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేసింది. డీచ్‌పల్లి 18 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రియాజ్‌ 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 32 పరుగుల తేడాతో ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 49 పరుగులు సాధించిన రాకేష్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచారు.

సత్తా చాటిన నంద్యాల శాంతిరాం ఫార్మసీ జట్టు 

మూడో పోటీ నంద్యాల శాంతిరాం ఫార్మసీ కళాశాల జట్టు, ఎమ్మిగనూరు నలంద జూనియర్‌ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన నంద్యాల జట్టు 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఫయిజుల్లా 29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేశారు. బౌలింగ్‌లో మెయిన్‌ 14 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. ఓవర్‌కు 9 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి ఎమ్మిగనూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఒంటిరి పోరాటం చేసిన వాహిద్‌ 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్‌్్సలతో 36 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ముసు 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 7 పరుగుల తేడాతో నంద్యాల శాంతిరాం ఫార్మసీ కళాశాల జట్టు గెలుపొందింది.  

ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు జయకేతనం

నాలుగో పోటీ కర్నూలు ఎస్టీబీసీ కళాశాల, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 7 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. శివ 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశారు. బౌలింగ్‌లో శ్రీకాంత్‌ 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఆదోని జట్టు 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. భరత్‌ 21 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేశారు. బౌలింగ్‌లో జంటప్ప 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 8 వికెట్ల తేడాతో ఆదోని        జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 

వైద్య కళాశాల మైదానం

దూసుకెళ్తున్న గూడూరు శ్రీసాయి వెంకటేశ్వర కళాశాల జట్టు

మొదటి పోటీ డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ విశ్వవిద్యాలయం (కర్నూలు), గూడూరు శ్రీసాయి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన గూడూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. అశోక్‌ 30 బంతుల్లో 1 ఫోర్‌తో 31 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ఫారుఖ్‌ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7.5 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్‌ అనంత్‌ సింగిల్స్‌ తీస్తూ 14 బంతుల్లో 14 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో భాస్కర్‌ 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 12 పరుగుల తేడాతో గూడూరు శ్రీ సాయి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ అశోక్‌ 31 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 

నంద్యాల ఆర్‌జీఎం జట్టు విజయభేరి

రెండో పోటీ జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (కర్నూలు), నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ జట్ల మధ్య జరిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 8 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. పరమేష్‌ 12 బంతుల్లో 1 ఫోర్‌తో 13 పరుగులు చేశారు. బౌలింగ్‌లో శ్రీధర్‌ 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన నంద్యాల జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయానికి కావాల్సిన 64 పరుగులు చేసింది. హరదీప్‌ 22 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి నాటౌట్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. బౌలింగ్‌లో వంశీ 16 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. 8 వికెట్ల తేడాతో నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. 30 పరుగులు సాధించిన హరదీప్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 

సత్తా చాటిన కేవీఎస్‌ఆర్‌ ఐటీ కర్నూలు జట్టు 

మూడో పోటీ కేవీఎస్‌ఆర్‌ ఐటీ కర్నూలు జట్టు, బేతంచర్ల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బేతంచర్ల జట్టు 35 పరుగులకే కుప్పకూలింది. శివప్రసాద్‌ 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 13 పరుగులు చేశారు. బౌలింగ్‌లో అశోక్‌ 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 4 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు వికెట్‌ నష్టపోకుండా విజయానికి కావాల్సిన 39 పరుగులు చేసింది. మైఖల్‌ 13 బంతుల్లో 8 ఫోర్లతో 32 పరుగులతో నాటౌట్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. 10 వికెట్ల తేడాతో కర్నూలు కేవీఎస్‌ఆర్‌ ఐటీ కళాశాల జట్టు విజయం సాధించింది. 

ఆల్‌ రౌండర్‌ ప్రతిభ చాటిన డోన్‌ ఐటీఐ జట్టు 

నాలుగో పోటీ ఆదోని భీమాస్‌ ఐటీ కళాశాల జట్టు, డోన్‌ ఐటీఐ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన డోన్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. శివకుమార్‌ 23 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేశారు. బౌలింగ్‌లో తిరుమలేష్‌ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 9 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఆదోని జట్టు 7 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేసింది. నరసింహా 25 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేశారు. బౌలింగ్‌లో పవన్‌ 4 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. 22 పరుగుల తేడాతో డోన్‌ ఐటీఐ కళాశాల జట్టు విజయం సాధించింది. బౌలింగ్‌లో రాణించడమేకాక ప్రత్యర్థి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన పవన్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.