close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/01/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బౌలర్ల హవా.. బ్యాట్స్‌మెన్ల డీలా

* ఉత్కంఠగా ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ఈనాడు-స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 క్రికెట్‌ జిల్లాస్థాయి పోటీలు నగరంలోని డీఎస్‌ఏ, వైద్య కళాశాల మైదానంలో హోరాహోరాగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో బౌలర్ల హవా కొనసాగింది. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలో పలువురు కీలకపాత్ర పోషించారు. శనివారం రోజు బౌలర్లు ఏకంగా 82 వికెట్లు తీయడం విశేషం. ముందుగా రాగమయూరి బిల్డర్స్‌ జీఎం ప్రసాద్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ పోటీలకు అసోసియేట్‌ స్పాన్సర్లుగా నారాయణ విద్యా సంస్థలు, రీజినల్‌ స్పాన్సర్లుగా దీక్ష జూనియర్‌ కళాశాల, జిల్లా స్పాన్సర్‌గా రాగమయూరి బిల్డర్స్‌ వ్యవహరిస్తున్నాయి. ప్రథమ చికిత్సను ఎస్‌జే ఆసుపత్రి వ్యవహరిస్తోంది. 

వైద్య కళాశాల మైదానం

బసిరెడ్డి డిగ్రీ కళాశాల జట్టు జయకేతనం

మొదటి పోటీ నందికొట్కూరు బసిరెడ్డి డిగ్రీ కళాశాల, రావూస్‌ డిగ్రీ కళాశాల (ఎమ్మిగనూరు) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన నందికొట్కూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. భువన్‌ 20 బంతుల్లో 1 ఫోర్‌తో 29 పరుగులు చేశారు. బౌలింగ్‌లో సాదిక్‌ 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 9 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఎమ్మిగనూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. రామాంజినేయులు 24 బంతుల్లో 18 పరుగులు చేశారు. బౌలింగ్‌లో దేవ 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 17 పరుగుల తేడాతో నందికొట్కూరు జట్టు విజయం సాధించింది.
డోన్‌ ఐటీఐ కళాశాల జట్టు విజయ పరంపర

మూడో పోటీ కేవీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల (ఆళ్లగడ్డ), డోన్‌ ప్రభుత్వ ఐటీఐ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన డోన్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. అరుణ్‌ 13 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేశారు. బౌలింగ్‌లో నాగేంద్ర 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 10 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఆళ్లగడ్డ జట్టు 86 పరుగులకే కుప్పకూలింది. నజీర్‌ 13 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేశారు. బౌలింగ్‌లో పవన్‌ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. 9 పరుగుల తేడాతో డోన్‌ ప్రభుత్వ  ఐటీఐ కళాశాల జట్టు విజయం సాధించింది. 

ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జోరు

రెండో పోటీ ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల, సాయిశ్రీ డిగ్రీ కళాశాల (డోన్‌) జట్ల మధ్య జరిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆదోని జట్టు 8 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. పవన్‌ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు చేశారు. బౌలింగ్‌లో వేణుగోపాల్‌ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 9 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన డోన్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కరుణాకర్‌ 17 బంతుల్లో 1 ఫోర్‌తో 17 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రోషన్‌ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 26 పరుగుల తేడాతో ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు విజయం  సాధించింది. 

కేవీఎస్‌ఆర్‌ ఐటీ కళాశాల జట్టు హవా

నాలుగో పోటీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఆత్మకూరు), కేవీఎస్‌ఆర్‌ ఐటీ (బీటెక్‌) కళాశాల (కర్నూలు) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆత్మకూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. హఫీజ్‌ 21 బంతుల్లో 1 ఫోర్‌తో 15 పరుగులు చేశారు. బౌలింగ్‌లో మెయినుద్దీన్‌ 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. సాయి శంకర్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు 21 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ఇలియాస్‌ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 4 వికెట్ల తేడాతో కెవీఎస్‌ఆర్‌ ఐటీ (బీటెక్‌) కళాశాల జట్టు విజయం సాధించింది. 

గూడూరు ఎస్‌.ఎస్‌.వి. జూనియర్‌ కళాశాల జట్టు జయకేతనం

మొదటి పోటీ గీతాంజలి డిప్లొమా కళాశాల (కర్నూలు), ఎస్‌.ఎస్‌.వి. జూనియర్‌ (గూడూరు) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 63 పరుగులకు ఆలౌటైంది. వీరేష్‌ 19 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేశారు. బౌలింగ్‌లో వీరేష్‌ 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన గూడూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. భాస్కర్‌ 14 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేశారు. బౌలింగ్‌లో మహేంద్ర 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 5 వికెట్ల తేడాతో గూడూరు ఎస్‌.ఎస్‌.వి. జూనియర్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. 

డీఎస్‌ఏ స్టేడియం

తిరుగులేని శాంతిరాం ఫార్మసీ కళాశాల జట్టు

మూడో పోటీ నంద్యాల శాంతిరాం ఫార్మసీ కళాశాల, కర్నూలు శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 53 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్‌ 7 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేశారు. బౌలింగ్‌లో లోకేష్‌ 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. ఓవర్‌కు 6 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన నంద్యాల జట్టు 2 వికెట్లు కోల్పోయి విజయానికి కావాల్సిన 57 పరుగులు చేసింది. ముసు 16 బంతుల్లో 2 ఫోర్లతో 2 సిక్స్‌లతో 24 పరుగులు చేశారు. బౌలింగ్‌లో పవన్‌ 10 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. 8 వికెట్ల తేడాతో నంద్యాల శాంతిరాం ఫార్మసీ కళాశాల విజయం సాధించింది. 13 పరుగులిచ్చి 5 వికెట్ల తీసిన లోకేష్‌ ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 


జోరు తగ్గని కర్నూలు వైద్య కళాశాల జట్టు

నాలుగో పోటీ కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు ఉస్మానియా డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కేఎంసీ కళాశాల జట్టు 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. సుధాకర్‌ 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 25 పరుగులు చేశారు. బౌలింగ్‌లో చైతన్య 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. ఓవర్‌కు 12 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఉస్మానియా జట్టు 8 వికెట్ల నష్టానికి 43 పరుగులు మాత్రమే చేసింది. మహేంద్ర 9 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేశారు. బౌలింగ్‌లో వెంకటేష్‌ 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. 68 పరుగుల తేడాతో కర్నూలు వైద్య కళాశాల జట్టు విజయం సాధించింది. 

ఉత్కంఠ పోరులో ఆత్మకూరు జూనియర్‌ కళాశాలదే విజయం

రెండో పోటీ ఇ.ఎస్‌.సి. పాలిటెక్నిక్‌ కళాశాల (నంద్యాల), ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఆత్మకూరు) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆత్మకూరు 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. సాయిసింగ్‌ 26 బంతుల్లో 1 సిక్‌్్సతో 26 పరుగులు చేశారు. బౌలింగ్‌లో గుప్తా 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన నంద్యాల జట్టు 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. స్వరూప్‌ 19 బంతుల్లో 1 ఫోర్‌తో 19 పరుగులు చేశారు. బౌలింగ్‌లో నిరంజన్‌ 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఉత్కఠ భరింత పోరులో ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.