close

తాజా వార్తలు

ఏలూరులో ఉత్సాహంగా ఈసీఎల్‌ క్రికెట్‌

దెందులూరు, న్యూస్‌టుడే: ఏలూరులోని ఆశ్రం వైద్య విద్య కళాశాల క్రీడా మైదానంలో ‘ఈనాడు’ స్పోర్ట్స్‌ లీగ్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంటు శుక్రవారం మొదలైంది. క్రికెట్‌ అసోసియేషన్‌ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వగేష్‌ కుమార్, ఆశ్రం వైద్య విద్య ఫిజికల్‌ డైరెక్టరు శ్రీనివాసరాజులు పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ‘ఈనాడు’ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 

రెండు వికెట్ల తేడాతో డీపాల్‌ జట్టు విజయం: తొలిమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేఏహెచ్‌ఎల్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. పది ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ విన్సెంట్‌ డీపాల్‌ కళాశాల జట్టు నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసి విజయం సాధించింది. 

నరేంద్ర హ్యాట్రిక్‌: డీపాల్‌ జట్టుకు చెందిన నరేంద్ర వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ సాధించాడు. మొత్తం నాలుగు వికెట్లు, 35 పరుగులు చేసి జట్టు     విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఏలూరు ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు గెలుపు: రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నారాయణపురం ఎస్‌ఎస్‌జే ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు, ఏలూరు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అనంతరం ఎస్‌ఎస్‌జే జట్టు 9.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

అఖిల్‌ హ్యాట్రిక్‌: ఏలూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఆఖిల్‌ ఒకే ఓవర్‌లో వరుసగా మూడు వికెట్లు    తీసి హ్యాట్రిక్‌ సాధించాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసి జట్టు గెలుపునకు కృషిచేశాడు.

సుధాకర్‌ అర్ధ సెంచరీ: ఇదే కళాశాలకు చెందిన సుధాకర్‌ 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకం అయ్యాడు.     8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేశాడు. 

ఒక వికెట్‌ నష్టంతో సీఆర్‌రెడ్డి విజయం: మూడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఏలూరు సీఆర్‌ రెడ్డి డిగ్రీ కళాశాల జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుగు బ్యాటింగ్‌ చేసిన నల్లజర్ల డాక్టరు ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాల జట్టు 9.3 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 47 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన సీఆర్‌ రెడ్డి జట్టు 4.2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి   48 పరుగులు చేసి విజయం సాధించింది.

భీమవరంలో...

భీమవరంఅర్బన్, న్యూస్‌టుడే: భీమవరం పట్టణంలోని కేజీఆర్‌ఎల్‌ కళాశాల క్రీడా మైదానంలో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీలో శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన సీతా పాలిటెక్నిక్‌ కళాశాల జట్టులో నాయుడు అనే ఆటగాడు ఆల్‌రౌండ్‌ ప్రతిభను చూపాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులు చేయటంతో పాటు మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. అంపైర్లుగా శ్రీధర్, మురళీపాండే వ్యవహరించారు.

పరుగుల జోరు...వీక్షకుల హుషారు : తొలి మ్యాచ్‌లో సీతా పాలిటెక్నిక్‌ కళాశాల (భీమవరం) జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల (భీమవరం) జట్టు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సీతా పాలిటెక్నిక్‌ కళాశాల (భీమవరం) జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 72 పరుగులు చేసి విజయం సాధించింది.

డీఎన్నార్‌ కళాశాల జట్టు జోరు: రెండో మ్యాచ్‌లో డీఎన్నార్‌ జూనియర్‌ కళాశాల (భీమవరం) జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచిన ఈ జట్టు మొదట బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 90 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీమారుతి జూనియర్‌ కళాశాల (తణుకు) జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

తణుకు జట్టుదే విజయం : మూడో మ్యాచ్‌లో ఎస్‌.సి.ఐ.ఎం గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల (తణుకు) జట్టు గెలుపొందింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన ఈ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన శ్రీవైఎన్‌ పీజీ కళాశాల (నరసాపురం) జట్టు తొమ్మిది ఓవర్లలో 64 పరుగులకు ఆలౌటైంది. విజేత జట్టులో ప్రదీప్‌కుమార్‌ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.