close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/01/2020 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్నూలులో పరుగుల వరద

* హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019

* సత్తా చాటిన పలువురు బ్యాట్స్‌మెన్లు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ఈనాడు-స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 క్రికెట్‌ జిల్లాస్థాయి పోటీలు నగరంలోని డీఎస్‌ఏ, వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్నాయి. గురువారం జరిగిన పోటీల్లో బ్యాట్స్‌మెన్స్‌ హవా కొనసాగింది. 8 పోటీల్లో 684 పరుగులు సాధించడం వారి జోరుకు అద్దం పడుతోంది. ఈ పోటీలకు అసోసియేట్‌ స్పాన్సర్లుగా నారాయణ విద్యా సంస్థలు, రీజినల్‌ స్పాన్సర్లుగా దీక్ష జూనియర్‌ కళాశాల, జిల్లా స్పాన్సర్‌గా రాగమయూరి బిల్డర్స్‌ వ్యవహరిస్తున్నాయి. ప్రథమ చికిత్సను ఎస్‌జే ఆసుపత్రి అందిస్తోంది. 

వైద్య     కళాశాల మైదానం..

కర్నూలు వైద్య కళాశాల జట్టు పరుగుల హోరు

మొదటి పోటీ కర్నూలు వైద్య కళాశాల, శ్రీ శంకరాస్‌ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కేఎంసీ జట్టు 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాగప్రవీణ్‌ 34 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో మధు 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఓవర్‌కు 12 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన శ్రీ శంకరాస్‌ జట్టు 24 పరుగులకే కుప్పకూలింది. హనుమంతు 14 బంతుల్లో 14 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో అర్షద్‌ 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 94 పరుగులతో కర్నూలు వైద్య కళాశాల జట్టు విజయం సాధించింది. నాగప్రవీణ్‌ 66 పరుగులతో మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచారు. 

బసిరెడ్డి డిగ్రీ కళాశాల జట్టు సమరోత్సాహం

రెండో పోటీ నందికొట్కూరు బసిరెడ్డి డిగ్రీ కళాశాల, కర్నూలు సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన నందికొట్కూరు జట్టు 1 వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. భువన్‌ 25 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులతో నాటౌట్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. ప్రత్యర్థి జట్టులో నజీర్‌ 20 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. ఓవర్‌కు 11 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. శ్యామ్‌ 31 బంతుల్లో 1 ఫోర్‌తో 40 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. ప్రత్యర్థి జట్టులో దేవంద్ర 21 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. 18 పరుగుల తేడాతో నందికొట్కూరు బసిరెడ్డి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 34 పరుగులు సాధించిన భువన్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 


ఎమ్మిగనూరు రావూస్‌ డిగ్రీ కళాశాల సత్తా

మూడో పోటీ నంద్యాల శాంతిరాం ఇంజినీరింగ్‌ కళాశాల, రావూస్‌ డిగ్రీ కళాశాల (ఎమ్మిగనూరు) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఎమ్మిగనూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. రామాంజినేయులు 24 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో సుదర్శన్‌ 21 పరుగులిచ్చి 1 వికెట్లు తీశారు. ఓవర్‌కు 9 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన నంద్యాల జట్టు 64 పరుగులకే కుప్పకూలింది. గౌస్‌ 15 బంతుల్లో 1 ఫోర్‌తో 15 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో దినకర్‌ 4 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. 16 పరుగుల తేడాతో రావూస్‌ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది. 27 పరుగులు చేసిన రామాంజినేయులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 

డోన్‌ సాయిశ్రీ డిగ్రీ కళాశాల విజయదరహాసం

నాలుగో పోటీ సాయిశ్రీ డిగ్రీ కళాశాల (డోన్‌), పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పత్తికొండ జట్టు 77 పరుగులకే కుప్పకూలింది. వీరాంజినేయులు 10 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేశారు. వేణుగోపాల్‌ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 8  నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన డోన్‌ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయానికి కావాల్సిన 79 పరుగులు చేసింది. విష్ణు 22 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ఫరూఖ్‌ 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 6 వికెట్ల తేడాతో డోన్‌ సాయిశ్రీ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.


డీఎస్‌ఏ స్టేడియం

గూడూరు శ్రీసాయి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జయకేతనం

మొదటి పోటీ కర్నూలు గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాల, గూడూరు శ్రీసాయి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచిన గూడూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. అమీర్‌ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులు చేశారు. బౌలింగ్‌లో నరేష్‌ 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 11 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. నవీన్‌ 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ఆశోక్‌ 2 వికెట్లు తీశారు. 33 పరుగుల తేడాతో గూడూరు శ్రీసాయి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 31 పరుగులు చేసిన అమీర్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 


బేతంచర్ల వివేకానంద డిగ్రీ కళాశాల హవా

మూడో పోటీ బేతంచర్ల వివేకానంద డిగ్రీ కళాశాల, కర్నూలు కేవీఎస్‌ఆర్‌ ఐటీ కళాశాల జట్ల జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు 5 వికెట్ట నష్టానికి 43 పరుగులు చేసింది. కార్తీక 17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేశారు. బౌలింగ్‌లో ప్రశాంత్, 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 5 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన బేతంచర్ల జట్టు 1 వికెట్‌ కోల్పోయి విజయానికి కావాల్సిన 44 పరుగులు చేసింది. రమేష్‌ 13 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశారు. బౌలింగ్‌లో మధు 20 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. 9 వికెట్ల తేడాతో బేతంచర్ల వివేకానంద డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 

ఆళ్లగడ్డ కేవీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల జయకేతనం

నాలుగో పోటీ డోన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేవీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల (ఆళ్లగడ్డ) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన డోన్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ప్రవీణ్‌ 17 బంతుల్లో 1 ఫోర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. హుసేన్‌ 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఓవర్‌కు 7 నెట్‌ రన్‌రేట్‌తో బరిలోకి దిగిన ఆళ్లగడ్డ జట్టు 5 వికెట్ల నష్టానికి విజయానికి కావాల్సిన 64 పరుగులు చేసింది. నాగేష్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్‌్్సలతో 34 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రాజు 26 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశారు. 8 వికెట్ల తేడాతో ఆళ్లగడ్డ కేవీఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. 34 పరుగులు చేసిన నాగేష్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచారు. 

గెలుపొందిన నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాల 

రెండో పోటీ నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాల, ఎమ్మిగనూరు శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన నంద్యాల జట్టు 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. శ్రీనాథ్‌ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రాహుల్‌ 1 వికెట్‌ తీశారు. బ్యాటింగ్‌ కొనసాగించిన ఎమ్మిగనూరు జట్టు 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రకాశ్‌ 14 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేశారు. బౌలింగ్‌లో విజయ్‌ 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. 38 పరుగుల తేడాతో నంద్యాల ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. 44 పరుగులు చేసిన శ్రీనాథ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.