close

తాజా వార్తలు

Updated : 25/09/2020 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌: భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గంచెరువు తీగల వంతెన (కేబుల్‌ బ్రిడ్జి) అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ మధ్య ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గనున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్‌ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించరు

రూ.184 కోట్ల వ్యయంతో 754.38 మీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెనను పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా కేవలం రెండు పిల్లర్లపై ఈ వంతెనను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజినీర్లు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ వంతెన ప్రారంభం కావడంతో జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్‌, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ మేర దూరం తగ్గనుంది. బ్రిడ్జికి ఎల్‌ఈడీ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనిపై మొత్తం 40వేల ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. దుర్గం చెరువును ప్రభుత్వం పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తోంది. ఈ బ్రిడ్జిపైకి ప్రతి శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించరు. వారాంతాల్లో కేవలం పర్యాటకులకు మాత్రమే కాలినడకన అనుమతిస్తామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.