close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/07/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాకు చాలా కోపం వచ్చేస్తోంది...

చైనాపై మండిపడ్డ ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటంపై ఆ దేశ వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ తమ చేతుల్లో లేదని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తమయేందుకు, అంతర్జాతీయంగా అతిక్లిష్ట సమస్యగా మారేందుకు చైనాయే కారణమని.. అందుకు తనకు చాలా కోపంగా ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

‘‘కరోనా మహమ్మారి ప్రపంచమంతటా భయంకరంగా వ్యాపించడం కనిపిస్తోంది. అమెరికాలోనే కాకుండా ఈ వ్యాధి ప్రపంచమంతటా విధ్వంసాన్ని సృష్టించింది. ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు.. నాకు కూడా అర్ధమయింది. దీనంతటికీ కారణమైన చైనాపై నాకు కోపం అంతకంతకూ పెరిగిపోతోంది’’ అని ట్విటర్‌లో ప్రకటించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.