47మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా!
close

తాజా వార్తలు

Published : 29/04/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

47మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా!

దిల్లీ: దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో విధులు నిర్వర్తిస్తోన్న 12మంది భద్రతరా సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు 47మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ వైరస్‌ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో అసోంకు చెందిన ఒక జవాన్‌ సోమవారం దిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రిలో మరణించినట్లు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ బెటాలియన్‌లోని దాదాపు వెయ్యి మందిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తున్నారు. తొలుత సీఆర్‌పిఎఫ్ యూనిట్‌లో విధులు నిర్వర్తించే పారామెడికల్‌ జవానుకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ బెటాలియన్‌లో మరికొందరికి నిర్ధారణ కావడం మొదలైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 47కి చేరింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ముందుండి విధులు నిర్వర్తిస్తోన్న వైద్యులతో పాటు భద్రతా సిబ్బందికి వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదిలా ఉంటే, దిల్లీలో ఇప్పటివరకు 3314 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 1078 మంది కోలుకోగా 54మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

ఇవీ చదవండి..

భారత్‌లో 1000 దాటిన కరోనా మరణాలు

చైనాపై ఆధారపడొద్దు..!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని