దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పరీక్షలు
close

తాజా వార్తలు

Updated : 16/06/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పరీక్షలు

దిల్లీ: అనారోగ్యానికి గురైన దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్.. నిన్న రాత్రి రాజధానిలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో తాను బాధపడుతున్నానని.. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి హఠాత్తుగా పడిపోయిందని మంత్రి ట్విటర్ ద్వారా ప్రకటించారు. కాగా మంత్రి సత్యేందర్‌ జైన్‌కు నేడు కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. నిరంతరం ప్రజల సేవకే అంకితమైన మంత్రి సత్యేందర్‌ జైన్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆకాంక్షించారు.

కాగా దిల్లీలో కరోనా వైరస్‌ కట్టడి గురించి చర్చించేందుకు ఆదివారం నిర్వహించిన సమావేశంలో సత్యేందర్‌ జైన్ పాల్గొన్నారు. ఇదే సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌‌ సిసోడియాతో సహా పలువురు ప్రముఖులు పాల్గోవటం గమనార్హం. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కూడా గతవారం కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయగా..నెగిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని