
తాజా వార్తలు
వ్యాక్సిన్ అందరికీ వేయాల్సిన అవసరం లేదు
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్
దిల్లీ: దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సాంకేతికపరమైన విషయాలు మాట్లాడేటపుడు సరైన సమాచారం ఉంటేనే మాట్లాడాలి అని ఆయన ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వ్యాక్సిన్ ఇవ్వడం అనేది దాని సమర్థతపై ఆధారపడి ఉంటుందన్నారు. వైరస్ సంక్రమణ గొలుసు తెంచడమే వ్యాక్సిన్ ప్రధాన ఉద్దేశమని ఐసీఎంఆర్ డీజీ డా. బలరామ్ భార్గవ వెల్లడించారు. ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్‌కేసులు 5లక్షల కంటే తక్కువగానే ఉన్నాయి. రోజూవారీగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌కేసుల శాతం తగ్గిందని వారు వెల్లడించారు. ఒక్కరోజులోనే 11,349 యాక్టివ్ కేసులు తగ్గాయని వారు తెలిపారు. గడచిన 24గంటల్లో కేరళ, దిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతుండగా, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, గోవాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
