బ్యాంకుల అధిపతులతో ఆర్‌బీఐ గవర్నరు భేటీ
close

తాజా వార్తలు

Published : 03/05/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల అధిపతులతో ఆర్‌బీఐ గవర్నరు భేటీ

ఉద్దీపన చర్యల అమలు తీరుపై సమీక్ష

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఊతానికి చేపట్టిన వివిధ చర్యల అమలు తీరుపై బ్యాంకుల అధిపతులతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు సెషన్స్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీలు), ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు) ఇందులో పాల్గొన్నారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు బ్యాంకులు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా గవర్నరు ప్రశంసించారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్థితిపై, ఆర్థిక రంగంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, గృహ రుణాల కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు సహా వివిధ రంగాలకు నిధుల లభ్యతపైనా, రుణాలు ఈఎంఐల చెల్లింపునకు మూడు నెలల పాటు మారటోరియం వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అమలుపైనా సమీక్ష జరిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని