తెలంగాణలో ఒక్క రోజే @ 1850
close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో ఒక్క రోజే @ 1850

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత ఉద్ధృతమవుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రజల్లో తీవ్ర కలవరం రేపుతోంది. తాజాగా శనివారం 1850 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 6427 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1850 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 4577 నెగెటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,312కి చేరింది.

కొత్తగా 1342మంది రికవరీ

రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం ఉపశమనం కలిగించే అంశం. గడిచిన 24గంటల్లో 1342 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 11,537కి పెరిగింది. అలాగే, కొత్తగా ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 288కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

హైదరాబాద్‌పై కరోనా పంజా 

హైదరాబాద్‌ మహానగరంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఈ రోజు 1572 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌ జిల్లలో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌ జిల్లాలో 17  చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా శనివారం నమోదైన కేసుల్ని పరిశీలిస్తే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని