close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/02/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్‌కు సమన్లు

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి ఘటనపై సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణకు మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ జగదీశన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌ ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

గత ఏడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన రజనీ కాంత్‌ మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అప్పట్లో దీనిపై వివరణ కోరగా చెప్పేందుకు రజనీ నిరాకరించారు. కానీ, తనకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే తాజాగా రజనీకి సమన్లు జారీకావడంతో ఆయన వ్యాఖ్యలపై కమిషన్‌ వివరణ కోరే  అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు కమిషన్‌ 379 మందిని ప్రశ్నించింది. ఆయా వివరాలను హైకోర్టు ముందుంచింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.