close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/06/2020 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఘర్షణకు ముందే మార్షల్‌ యోధులను పంపిన చైనా!

వెల్లడించిన అక్కడి అధికారిక మీడియా


బీజింగ్‌ : గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందే  చైనా పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గల్వాన్‌ ఘటనకు కొద్దిసేపటికి ముందే సరిహద్దు ప్రాంతాల్లో చైనా తన బలగాలను పర్వతారోహకులు, మార్షల్‌ ఆర్ట్స్‌ యోధులతో  బలోపేతం చేసిందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించడం గమనార్హం.

మౌంట్‌ ఎవరెస్ట్‌ ఒలింపిక్‌ టార్చ్‌ రిలే జట్టు మాజీ సభ్యులు, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ యోధులతో కూడిన ఐదు కొత్త మిలీషియా గ్రూపులు జూన్‌ 15న టిబెట్‌ రాజధాని లాసాలో మోహరించాయని ఆ దేశ అధికారిక మిలటరీ పత్రిక ‘చైనా నేషనల్‌ డిఫెన్స్‌ న్యూస్‌’ పేర్కొంది. వందలాది కొత్తబలగాలతో కూడిన దళాల దృశ్యాలను చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ కూడా చూపించింది.

ఈ నియామకాలు దళాల సమీకరణ బలాన్ని, వేగంగా ప్రతిస్పందించే చర్యలను పెంచుతాయని టిబెట్‌ కమాండ్‌ వాంగ్‌ పేర్కొన్నట్లు చైనా నేషనల్‌ డిఫెన్స్‌ న్యూస్‌ పేర్కొంది. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ విస్తరణ చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టంగా పేర్కొనలేదు. సరిహద్దులను బలోపేతం చేయడం, టిబెట్‌ను స్థిరపరచడమే లక్ష్యంగా కొత్త దళాల నియామకం జరిగినట్లు ఆ పత్రిక వెల్లడించింది.

ఈ పరిణామాల తర్వాతనే అక్కడికి 1300 కి.మీ దూరంలోని లద్ధాఖ్‌ ప్రాంతంలో భారత్‌, చైనా బలగాలు ఘర్షణలకు దిగాయి. ఈ ఘటనలో 20 మంది తమ జవాన్లు వీరమరణం చెందినట్లు భారత్‌ పేర్కొంది. అయితే చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ.. ఆ విషయాన్ని ఆ దేశం అంగీకరించడం లేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.