close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120055147 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1253676250024914944 [video_short_link] => 1253676250024914944 [created_by] => [created_date] => [modified_by] => 8925861 [modified_date] => 2020-04-24 22:15:59.107006 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 24/04/2020 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసులపై చంద్రబోస్‌ పాట.. చిరు ప్రశంస

హైదరాబాద్‌: కరోనా కారణంగా అంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. నిద్రాహారాలు మాని మండుటెండలో విధులు నిర్వహిస్తూ, ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. జనం కోసం పోలీసులు పడుతున్న కష్టాన్ని పాటగా మలిచారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌. ‘ఈ కరోనా కష్ట కాలంలో పోలీసుల విధి నిర్వహణ విధానం చాలా గొప్ప ఉంది. చాలా మంది ప్రజలు వారికి సహకరిస్తున్నారు. కొంతమంది అడ్డు తగులుతున్నారు కూడా. ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌గారు నన్ను అడిగారు. బాధ్యతతో రాసిన ఆ  పాట..’ అంటూ ట్విటర్‌ వేదికగా ఆ పాటను స్వయంగా ఆలపించి అభిమానులతో పంచుకున్నారు.

‘ఆలోచించండి అన్నలారా.. ఆవేశం మానుకోండి తమ్ములారా..’ అంటూ సాగిన గీతం ప్రజల కోసం పోలీసులు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తోంది. దీనిపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. ‘కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు పోలీసులు వారి జీవితాలను పణంగా పెట్టి ముందుండి పోరాటం చేస్తున్నారు. దయ చేసి వారికి సహకరిద్దాం. చంద్రబోస్‌ రాసి, ఆలపించిన పాట ఆలోచింపజేసేలా ఉంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.