close

తాజా వార్తలు

Published : 02/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇళ్లస్థలాలకు మేం అడ్డుపడ్డామా?: చంద్రబాబు

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకి డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం వెలుపల మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. అధికార పార్టీ మాయమాటలు చెబుతోందన్నారు. ఎదురుదాడి చేస్తూ తమ నోరు మూయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి తాము అడ్డుపడ్డామంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అడ్డుపడ్డామో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. స్థానికంగా అన్యాయం జరిగిన వాళ్లు కోర్టులను ఆశ్రయించారని చెప్పారు. పేదల ఇళ్ల స్థలాలకు అసైన్‌మెంట్‌ భూములు, ఆవ భూములు, ఆట స్థలాలు, శ్మశానాలు ఇస్తారా? అని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో రూ.4వేల కోట్ల అవినీతి జరిగిందని.. ధైర్యముంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు. వైకాపా నేతలు చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. అన్ని కేటగిరీల్లో టిడ్కో ఇళ్లన్నీ ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆ ఇళ్లు ఎప్పటిలోగా పూర్తిచేస్తారో స్పష్టం చేయాలని.. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలన్నారు.

ఇవీ చదవండి..

మేం కట్టిన ఇళ్లకి మీ స్టిక్కరా?: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన