
తాజా వార్తలు
మసాలాతో ధర్మపాల్ చిత్రపటం.. ట్వీట్ వైరల్
ఇంటర్నెట్ డెస్క్: ఎండీహెచ్ మసాలా యజమాని మహాశయ్ ధర్మపాల్ గులాటి డిసెంబర్ 3న కన్నుమూసిన విషయం తెలిసిందే. చండీగఢ్‌కు చెందిన కళాకారుడు వరుణ్ టాండన్ సుగంధ ద్రవ్యాలతో గులాటి చిత్రపటాన్ని వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ధర్మపాల్ మసాలా పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. తమ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. రాష్ట్ర్రపతి రామ్‌నాథ్ కోవింద్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.
ఎండీహెచ్ మసాలాను ఇష్టపడేవారు సైతం మహాశయ్కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వరుణ్ టాండన్ వేసిన ధర్మపాల్ చిత్రపటాన్ని శుక్రవారం ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. ‘సుగంధ ద్రవ్యాలతో గులాటీ చిత్రపటాన్ని వరుణ్ టాండన్ గీశాడు. గులాటీ ఫొటోను ఈ పెయింటింగ్‌లో చూడొచ్చు. అతడు వేసిన మసాలా అధినేత ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఆయనకు గొప్ప నివాళి’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.