close

తాజా వార్తలు

Published : 07/02/2020 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ విషయం బోయపాటినే అడగండి: కేథరిన్‌

‘ప్రేమ గురించి చెప్పడం కష్టం’ : కేథరిన్‌

హైదరాబాద్‌: ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రంలో ఆకాంక్షగా మెప్పించి.. తన ఒయ్యారాలతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి కేథరిన్‌. ఆ తర్వాత ‘సరైనోడు’ సినిమాతో ‘ఎమ్మెల్యే’గా అలరించింది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’, ‘ఓనమాలు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించారు. విజయ్‌కు జంటగా కేథరిన్‌తోపాటు రాశీఖన్నా, ఐశ్వర్యరాజేశ్‌, ఇజబెల్లా లైట్‌ ఆడి పాడనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా గురించి నటి కేథరిన్‌ విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

ఆయన బలం అదే..

‘‘షూటింగ్‌ ప్రారంభించడానికి ఎనిమిది నెలల ముందు క్రాంతిమాధవ్‌ నన్ను కలిశారు. ఆ సమయంలో ఆయన నాకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ కథ చెప్పారు. కథ, పాత్రల గురించి వివరించి చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ప్రతి పాత్ర చాలా కీలకంగా ఉండేలా ఈ కథను రాశారు. అప్పుడే ఆయన తీసిన ‘మళ్లీమళ్లీ ఇది రానిరోజు’, ‘ఓనమాలు’ సినిమాలు చూశాను. ఆ రెండూ నాకు బాగా నచ్చాయి. క్రాంతిమాధవ్‌ మంచి రైటర్‌. ఆయన బలమదే’’

మార్పులు వద్దు అలాగే రా.. 

‘‘క్రాంతిమాధవ్‌ కథ, నా పాత్రను వర్ణించిన తీరు నాకు బాగా నచ్చాయి. కాకపోతే కొంత టైం ఇవ్వమని అడిగాను. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒకరోజు నేను క్రాంతి మాధవ్‌ను కలిసి... ‘మీ సినిమాలోని పాత్ర కోసం నన్నే ఎందుకు తీసుకున్నారు’ అని ప్రశ్నించాను. దానికి ఆయన.. ‘స్మితా.. క్యారెక్టర్‌కు నిన్ను తప్ప వేరేవాళ్లను అనుకోలేకపోతున్నాను’ అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే నేను.. ‘ఆ పాత్ర కోసం నేను ఏమైనా మారాలా?’ అని క్రాంతిని అడిగాను. దానికి ఆయన.. ‘మార్పులేమీ వద్దు. నువ్వు ఎప్పుడూ ఎలా ఉంటావో అలాగే స్మిత క్యారెక్టర్‌లో నటించు చాలు.’ అని చెప్పారు.

మొదటిసారి అక్కడే కలిశా..

‘‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నాతోపాటు మరో ముగ్గురు తారలు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నేను ఎవరితోనూ కలిసి నటించలేదు. ఐశ్వర్య రాజేశ్‌ కాకుండా మిగిలిన ఇద్దరు హీరోయిన్స్‌ను గురువారం సాయంత్రం కలిశాను. అది కూడా ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో మాత్రమే. కాకపోతే మిగిలిన ముగ్గురు నటీమణులు కూడా బాగా నటించారని నేను చెప్పగలను.

నంబర్స్‌తో సంబంధం లేకుండా..

‘‘బాక్సాఫీస్‌ నంబర్లతో సంబంధం లేకుండా మంచి పాత్రలను పోషించాలనేదే నా లక్ష్యం. అంటే మీరు ఒక సినిమా చూసినప్పుడు ‘ఇందులో కేథరిన్‌ మంచిగా నటించింది’ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా నా నటన ఉండాలని నేను భావిస్తాను’’

అదే ఈ సినిమాకి కీలకం.. 

‘‘ప్రతి సినిమాలో ప్రేక్షకులను మెప్పించే కీలకమైన అంశం ఉంటుంది. అలాగే ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు మెప్పించేది కథ. నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది. వారిద్దరి మధ్య వచ్చే గొడవలు.. ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చాలా సహజంగా చూపించారు’’

విజయ్‌తో నా సీన్స్‌..

‘‘ఇందులో నేను స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. బొగ్గుగనిలో అధికారిగా కనిపిస్తుంటాను. స్మిత పాత్రకు, నాకూ మధ్య చాలా పోలికలున్నాయి. ఈ సినిమాలో నా సన్నివేశాలన్నీ చాలా సరదాగా, సంతోషంగా సాగిపోతాయి. అలాగే విజయ్‌కి, నాకూ మధ్య చిత్రీకరించిన సీన్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. విజయ్‌ మంచి వ్యక్తి. సెట్‌లో చాలా సైలెంట్‌.  తను ఏ పాత్రను పోషిస్తే వెంటనే ఆ పాత్రలోకి ఒదిగిపోతాడు. విజయ్‌లో నాకు ఈ విషయం బాగా నచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి’’

ప్రేమ.. చెప్పడం కష్టం..

‘‘ప్రేమని నమ్ముతాను. కానీ దాని గురించి చెప్పడం కష్టం. అది ఒక మంచి ఫీల్‌ గుడ్‌ ఎమోషన్‌ అని నా ఫీలింగ్‌’’

బోయపాటిని అడగండి..

‘‘ఇటీవల ప్రారంభమైన బోయపాటి-బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానంటూ చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చిత్ర బృందం నన్ను సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ విషయం గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. కానీ నేను చెప్పేది ఒక్కటే.. ‘బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానో లేదో తెలుసుకోవాలంటే బోయపాటిని అడగండి’’.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని