close

తాజా వార్తలు

Published : 11/07/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపా నేతలను కించపరిచారని కేసు నమోదు

అమరావతి: సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీనేతలను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ గుంటూరు  జిల్లా సత్తెనపల్లి జనసేన నాయకుడు భావన్నారాయణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక సామాజిక  వర్గాన్ని కించపరిచేలా పోస్టులు ఉన్నాయని వైకాపా నేత మోహన్‌ బాబు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేశారు. కాపు రిజర్వేషన్లు, కార్పోరేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  డిమాండ్‌పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఆ విమర్శలు తప్పుబడుతూ భావన్నారాయణ సామాజిక  మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వైకాపాలోని కాపు నాయకులు జగన్‌ పట్ల విశ్వాసం చూపిస్తున్నారని  సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.
 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని