close

తాజా వార్తలు

Updated : 25/07/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాజమానిపై బెంగ.. వెనక్కొచ్చిన ఒంటె

బీజింగ్‌: పెంపుడు జంతువులు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. యజమాని పట్ల ప్రేమ చూపిస్తాయి. ఈ విషయంలో శునకాలు ఒక అడుగు ముందే ఉంటాయి. ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ చనిపోతే అతడి పెంపుడు శునకం కూడా బెంగ పెట్టుకుందన్న వార్తలు చదివాం. తాజాగా పెంపుడు ఒంటె విషయంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన నెటిజన్ల మనసును హత్తుకుంది. పాత యజమానిపై బెంగతో ఓ పెంపుడు ఒంటె ప్రస్తుత యాజమాని ఇంటి నుంచి పారిపోయింది. తన యాజమానిని వెతుక్కుంటూ ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాకు చెందిన తెమూర్‌ దంపతులు.. వారు పెంచుకుంటున్న ఓ ఒంటెను గతేడాది అక్టోబర్‌లో మంగోలియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మేశారు. అతడు ఒంటెను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొత్త యజమాని ఇంట్లో ఎనిమిది నెలలపాటు ఉన్న ఒంటె తన పాత యాజమానిపై బెంగ పెట్టుకుంది. కొత్త యజమాని, ఆ ఇంటి వాతావరణం తనకు నచ్చకపోవడంతో గత నెల 27న ఇంటి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి పర్వతాలు, గుట్టలు, ఏడారులు దాటి 100 కిలోమీటర్లు ప్రయాణించి తన పాత యాజమాని ఉండే ప్రాంతం వైపునకు వచ్చింది. ఈ ప్రయాణంలో పలు చోట్ల కంచెలు దాడటంతో ఒంటెకు గాయాలు కూడా అయ్యాయి. ఒంటె ప్రయాణంపై దేశవ్యాప్తంగా వార్తలు రావడంతో ప్రస్తుత యాజమాని ఒంటెను తిరిగి తన ఇంటికి తీసుకెళ్లాడు. తెమూర్‌ దంపతులు కూడా ఆ వార్తలు చూసి చలించిపోయారు. ఎలాగైనా ఆ ఒంటెను తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 

‘‘మా కోసం ఒంటె అలా తిరిగొచ్చిందన్న విషయం తెలియగానే.. మేం దానిని తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుత యజమాని దానిని తిరిగి తీసుకెళ్లాడని తెలిసింది. మరో ఒంటెను ఇచ్చి ఆ ఒంటెను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మరోసారి ఆ ఒంటెను ఎవరికీ అమ్మబోం. తిరిగి తీసుకొచ్చిన వెంటనే దానికి స్వేచ్ఛనిస్తాం. నిజంగా ఒంటెలు చాలా తెలివైనవి’’అని తెమూర్‌ దంపతులు అన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.