close

తాజా వార్తలు

Published : 23/04/2020 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నూలు దుస్తుల నుంచి మాస్కులు

స్థానికులకు పంచిపెట్టిన సీఆర్పీఎఫ్ సిబ్బంది

గడ్చిరోలి: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాస్కుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్‌ ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్నంగా స్పందించింది. అందుబాటులో ఉన్న నూలు దుస్తుల నుంచి మాస్కులు తయారు చేసి స్థానికులకు పంపిణీ చేసింది. ‘స్థానికంగా మాస్కులు అందుబాటులో లేవు. వేరే ప్రాంతం నుంచి రావాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో మా క్యాంటీన్‌లో 415 కొత్త నూలు దుస్తులు కనిపించాయి. సాధారణ రోజుల్లో మా సిబ్బంది వాటిని వేసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నం. దీంతో వెంటనే దర్జీలు, సిబ్బందితో దుస్తులను కత్తిరించి మాస్కులు తయారు చేయించాం.  మొత్తం 2490 మాస్కులను పంపిణీ చేశాం’ అని బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి ప్రభాకర్‌ త్రిపాఠి వివరించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెటాలియన్‌ ఆధ్వర్యంలో స్థానికులకు శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు, నిత్యావసరాలు, ఆహారం పంపిణీ కొనసాగుతోంది. నెలరోజులుగా రోజూ 600 మందికి పైగా గ్రామస్థులకు భోజనం పెడుతున్నారు. ఇందులో రెండు పెళ్లి బృందాల సభ్యులూ ఉండటం గమనార్హం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని