close

తాజా వార్తలు

Updated : 03/02/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఆర్పీఎఫ్‌ జవాన్లపై గ్రనేడ్‌ దాడి

శ్రీనగర్‌: కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు, నలుగురు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. లాల్‌చౌక్‌ ప్రాంతలోని ప్రతాప్‌ పార్క్‌ సమీపంలో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆదివారం కావడంతో వారంతపు మార్కెట్‌కు వచ్చిన వారు భీతిల్లారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని