close

తాజా వార్తలు

Published : 29/01/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దవీందర్‌ ఎఫెక్ట్‌: సిబ్బందిపై సీఆర్పీఎఫ్‌ నిఘా

గురుగ్రామ్‌: ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన కశ్మీర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ ఉదంతం భద్రతాదళాల్లో కలకలం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ తమ 3లక్షలకు పైగా సిబ్బందిపై నిఘా పెట్టింది. విధ్వంసక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయా అన్న కోణంలో అంతర్గతంగా మెగా తనిఖీలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఏపీ మహేశ్వరీ తెలిపారు. 

ఈ సందర్భంగా ఏపీ మహేశ్వరీ మాట్లాడుతూ.. ‘దవీందర్‌ సింగ్‌ ఉదంతం విచారకరం, తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భద్రతా దళాన్ని బలహీనపర్చే ఇలాంటి ఘటనలను ఎప్పటికీ అనుమతించేదీ లేదు. అందుకే అన్ని బలగాలు తమ సిబ్బందిపై అంతర్గతంగా నిఘా పెట్టాలి. మా సిబ్బందిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ దవీందర్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పట్టుబడటం చాలా తీవ్రమైన అంశం. అందుకే మమ్మల్ని మేం పునఃసమీక్షించుకోవాల్సి వస్తోంది’ అని తెలిపారు.  

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న దవీందర్‌ సింగ్‌ను ఇటీవల జమ్ముకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఘటన అనంతరం దవీందర్‌ సింగ్‌ నివాసంలో తనిఖీలు చేపట్టిన దర్యాప్తు అధికారులు.. ఏకే-47, గ్రనేడ్లు, పిస్టోల్‌, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని