
తాజా వార్తలు
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రతి కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి విధుల్లో ఉంటారని.. ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్వాన్ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌ను సీపీ అంజనీకుమార్ బుధవారం తనిఖీ చేశారు. అన్ని శాఖల అధికారులతో కలిసి కమిషనరేట్ పరిధిలో 15 లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని సీపీ స్పష్టం చేశారు. ఓల్ట్ మలక్‌పేటలో రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వివరించారు.
Tags :
జనరల్
జిల్లా వార్తలు