
తాజా వార్తలు
ఎమ్మెల్యేగణేశ్ గుప్తాకు కేసీఆర్ పరామర్శ
మాక్లూర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆయన కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి కృష్ణమూర్తి ఇటీవల ఆకస్మికంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో ద్వాదశ దినకర్మను పురస్కరించుకుని మాక్లూర్‌లోని గణేష్‌గుప్తా ఇంటికి కేసీఆర్ వెళ్లారు. కృష్ణమూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వి.జి.గౌడ్, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంతు షిండే, జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు