close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/01/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాగడానికి వేడి నీళ్లు ఇచ్చాడని..

దిల్లీ: తాగేందుకు వేడి నీళ్లు ఇచ్చాడని కోపంతో డీఐజీ స్థాయి అధికారి కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆ వేడి నీటిని సదరు అధికారి కానిస్టేబుల్‌ మొహంపై కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈనెల 2వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
బిహార్‌లోని రాజ్‌గిర్‌ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్‌ లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ)గా పని చేస్తున్న డీకే త్రిపాఠి తాగేందుకు వేడి నీటిని ఇచ్చాడని కానిస్టేబుల్‌ అమోల్‌ ఖారత్‌ మొహంపై వాటిని విసిరి కొట్టాడు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  ఆయన ముఖం, శరీరం కమిలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి డీఐజీ త్రిపాఠిని విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ఈనెల 10లోపు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.