close

తాజా వార్తలు

తెదేపాకు బీద మస్తాన్‌రావు రాజీనామా

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా లేఖలో ఆయన పేర్కొన్నారు. మస్తాన్‌రావు వైకాపాలోకి వెళతారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్తాన్‌రావు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వైకాపాలో చేరికను మస్తాన్‌రావు ఇంకా ధ్రువీకరించలేదు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.