
తాజా వార్తలు
‘ఆ విషయంలో తెరాస విజయం సాధించింది’
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను యావత్ దేశం ఆసక్తితో చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు చేసిన కుట్రలో తెరాస విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. స్వయంగా పోలీసులే నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం పూర్తిగా సీఎం డైరెక్షన్లోనే నడుస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌కు సీపీఎం, సీపీఐ గుర్తులు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు పట్టించుకోలేదు: కిషన్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున మద్యం, నగదును పంపిణీ చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు. తెరాస చేస్తోన్న దౌర్జన్యాలను నిరసిస్తూ భాజపా నేతలు లక్ష్మణ్, డి.కె. అరుణ దీక్ష చేయడం అభినందనీయమని కిషన్ రెడ్డి అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
