close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/03/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమల్‌నాథ్‌ సర్కారుకు 16న బలపరీక్ష!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సంక్షోభం ఎదుర్కొంటున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ చీఫ్‌ విప్‌ నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. జ్యోతిరాధిత్య సింధియాతో పాటు ఆయన మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌నాథ్‌ సర్కారు ప్రమాదంలో పడింది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన నేపథ్యంలో ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు నరోత్తమ్‌ తెలిపారు. అదే రోజు నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు గవర్నర్‌, స్పీకర్‌ వద్ద ఉన్నాయని, దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మిశ్రా తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పేర్కొన్నారు. ఈ రాత్రికి ఆయన గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తన ముందు హాజరవ్వాలని ఎన్‌పీ ప్రజాపతి ఆదేశించారు. స్వచ్ఛందంగానే పదవుల నుంచి వైదొలిగారా? ఒత్తిడితో రాజీనామా చేశారా? తెలపాలని సూచించారు.

మధ్యప్రదేశ్‌ శాసనసభలో 228 స్థానాలున్నాయి. ప్రస్తుతం అందులో కాంగ్రెస్‌ బలం 114 కాగా.. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్‌ బలం 92కి చేరుతుంది. అధికారానికి 104 సీట్లు అవసరమవుతాయి. దీంతో 107 స్థానాలున్న భాజపా అధికారం కైవసం చేసుకోవడం సులవు అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్న స్వతంత్రులు, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు కూడా భాజపాకు మద్దతిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.