close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120019231 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1225778399659978752 [video_short_link] => 1225778399659978752 [created_by] => [created_date] => [modified_by] => 8924876 [modified_date] => 2020-02-10 00:16:15.375797 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 10/02/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భావోద్వేగానికి గురైన భాజపా అగ్రనేత అడ్వాణీ!

దిల్లీ: భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ ఇటీవల ‘శిఖర: అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌’ సినిమా చూస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘శిఖర: అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌’ అనే హిందీ సినిమాను ప్రముఖ దర్శకుడు విదు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. అయితే ఇటీవల ‘విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్‌’ సంస్థ అధికారిక ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియో ఏమిటంటే.. భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ ‘శిఖర’ సినిమా చూస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా చివరిలో అడ్వాణీ కళ్లలో నీళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. దర్శకుడు వినోద్‌ చోప్రా ఆయన వద్దకు వెళ్లి ఓదార్చుతారు. ఈ సన్నివేశాన్ని చూసి చుట్టుపక్కల వారు సైతం భావోద్వేగానికి గురికావడం గమనార్హం. అనంతరం అక్కడున్న వారు దర్శకుడికి అభినందనలు తెలియజేశారు. 

1990 ప్రారంభంలో కశ్మీర్‌ పండిట్లపై  ఉగ్రవాదులు దాడుల నేపథ్యంలో వారు ఇళ్ల నుంచి పారిపోవల్సి వచ్చింది. వారి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న విడుదల ఈ సినిమాలో ఆదిల్‌ ఖాన్‌, సాదియా నటీనటులుగా పాత్రలు పోషించారు. దర్శకుడు వినోద్‌ కశ్మీర్‌ లోయకు చెందిన వారే కావడం విశేషం. ఆయన ఈ చిత్రాన్ని తన తల్లికి అంకితం చేశారు. 

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.