close

తాజా వార్తలు

కేసీఆర్‌ పతనానికి తుక్కుగూడ నాంది: లక్ష్మణ్‌

తుక్కుగూడ: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ రాష్ట్ర రాజకీయాలను ఆలోచింప చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అక్రమంగా తుక్కుగూడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకొని ప్రజా తీర్పును తెరాస అవమానించిందని ఆయన ఆరోపించారు. తుక్కుగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, కేసీఆర్ పతనానికి ఈ మున్సిపాలిటీ నాంది కాబోతోందన్నారు. తుక్కుగూడ ఛైర్మన్ పదవి నైతికంగా భాజపాదేనని, అధికారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

భాజపా ఎదుగుదలను ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికక్కడ కార్యకర్తలను అణచి వేస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. అధికార పార్టీ భైంసా మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని అన్నారు. కేటీఆర్, కేసీఆర్‌లకు భయమని అందుకే తుక్కుగూడలో నీచ రాజకీయానికి పాల్పడ్డారని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు.

మోదీ నిర్ణయాలే భాజపాకు అతిపెద్ద బలమని లక్ష్మణ్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని, ఓవైసీతో దోస్తీ కోసమే సీఎం కేసీఆర్‌ సీఏఏను వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఏఏను అడ్డుకోవడమంటే పాకిస్థానీ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని లక్ష్మణ్‌ అభిప్రాయడ్డారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.