close

తాజా వార్తలు

Published : 16/02/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక బీఎస్‌-6 వాహనాలకు మారిపోండి!

న్యూదిల్లీ: ఇక నుంచి పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం వాహన తయారీ సంస్థలను కోరింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-4 ఇంజిన్‌తో కూడిన వాహనాల విక్రయాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విక్రయాల గడువును పెంచాలని కోరుతూ వాహన డీలర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వాహన తయారీదారులు తప్పకుండా బీఎస్‌-6 ప్రమాణాలతో వాహనాలను తయారు చేసి విపణిలోకి విడుదల చేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం వాహన విక్రయాలు మందగమనంలో సాగుతున్న నేపథ్యంలో మార్చి 31న నాటికి బీఎస్‌-4 ప్రమాణాలు కలిగిన వాహనాలను పూర్తిగా విక్రయించడం కఠినమైన విషయమే. ఈ నేపథ్యంలో ఆటో మొబైల్‌ డీలర్ల సంఘం వాహనాలు, వాటి విడి భాగాల తయారీదారులను పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే డీలర్లకు పంపాలని బీఎస్‌-4 వాహనాల బిల్లింగ్‌లను డీలర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని కోరింది. ఇక బీఎస్‌-4 వాహనాల విక్రయాలు రిజిస్ట్రేషన్లు మార్చి 31, 2020 లోగా పూర్తి చేసుకోవాలని డీలర్ల సంఘ అధ్యక్షుడు ఆశిష్‌ కాలే విజ్ఞప్తి చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.