close

తాజా వార్తలు

Published : 21/10/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ మార్జాలానికి 2 వేల ఏళ్లంట!

పెరూలో కొండపై పిల్లి చిత్రం గుర్తింపు 

లిమా: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో రెండు వేల ఏళ్ల నాడు కొండపై చెక్కిన పిల్లి బొమ్మను పురావస్తు శాఖాధికారులు గుర్తించారు. ఈ దేశంలోని నాజ్కా ప్రాంతంలో ఉన్న ఎడారి భూభాగం కొండపైన 37 మీటర్ల పరిధిలో మార్జాల కుడ్యం ఉన్నట్లు పెరూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. పెరూ రాజధాని లిమా ప్రాంతానికి ఈ పీఠభూమి ప్రాంతం 250 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ క్లాస్టిక్‌ రాళ్లపై చెక్కబడిన వందల కొద్ది వివిధ కళాకృతుల సమాహారం మనకు దర్శనమిస్తాయి.  
ఈ ఎడారి ప్రాంతం పర్యాటక ప్రదేశం కావడంతో సందర్శకుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడి కళాకృతులను చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఓ కొండపై నిర్వహణ పనులు చేస్తుండగా ఈ పిల్లి చిత్రం ఆనవాళ్లు కనిపించాయి. సహజంగా ఏర్పడిన భూమిపొరల్లో కోత వల్ల పిల్లి చిత్రం కనుమరుగయ్యే స్థితికి చేరుకుందని అక్కడి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పురావస్తుశాఖ ఇచ్చిన సమాచారం మేరకు ప్రాచీన చిత్ర సంపదను కాపాడుకునే పనుల్లో భాగంగా ఈ ప్రాంతంలో శుభ్రత చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ వివరించింది.

30 నుంచి 40 సెంటీమీటర్ల వెడల్పు గీతల కలయికతో ఉన్న పిల్లి చిత్రం మట్టి, రాళ్లతో పూడుకపోయింది. వాటిని తొలగించి శతాబ్దాల కాలం నాటి చిత్రాన్ని కాపాడే ప్రయత్నం చేసినట్లు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివరించింది. క్రీ.పూ 200 నుంచి క్రీ.పూ 100 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పిల్లి చిత్రాన్ని కొండపై చెక్కినట్లు పురావస్తుశాధికారులు గుర్తించారు. స్థానిక పారాకాస్‌ ఆచార సంప్రదాయాల్లో రాళ్లు, వస్ర్తాలపై ఇటువంటి పిల్లి చిత్రాలు కనిపిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే గత శతాబ్దకాలంలో కోతి, హమ్మింగ్‌బర్డ్‌ తదితర చెక్కిన చిత్రాలను ఈ ప్రాంతంలో కనుగొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.