close

తాజా వార్తలు

Published : 07/07/2020 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘30 లక్షల కుటుంబాలకు రూ.20 వేల కోట్ల ఆస్తి’

అమరావతి: పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేశాకనే పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్ం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వం 62 వేల ఎకరాలను సేకరించిందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. 
‘‘ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.7,500 కోట్లు చేశాం. రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. కోర్టు కేసులతోనే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడింది. ఆగస్టు 15కల్లా అడ్డంకులన్నీ తొలుగుతాయని ఆశాభావంతో ఉన్నాం. అలాగే వచ్చే 10 రోజుల్లోగా ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలి. ఇసుక కొరత ఉందనే మాట వినిపించకూడదు. కరోనా విషయంలో హోం ఐసోలేషన్‌ మీద కలెక్టరు దృష్టి పెట్టాలి. కొవిడ్ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలను అందించాలి’’అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని